Sugarcane Crop : చలికాలంలో చెరకు పంటకు నష్టం కలిగించే తుప్పు తెగులు, నివారణ మార్గాలు!

ముఖ్యంగా చలికాలంలో చెరకు తోటలను తుప్పు తెగులు తీవ్రంగా నష్టపరుస్తుంది. చల్లటి వాతావరణం, మంచు వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు మరింతగా వృద్ధి చెందుతుంది.

Sugarcane Crop : అధిక వర్షపాతం, సూర్యరశ్మి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో, నీటి సదుపాయం ఉన్న మెరక భూములు చెరకు పంట సాగుకు అనుకూలం. అధిక చెఱకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ముఖ్యమైన అంశాలపై రైతులు దృష్టిసారించాలి.

ముఖ్యంగా చలికాలంలో చెరకు తోటలను తుప్పు తెగులు తీవ్రంగా నష్టపరుస్తుంది. చల్లటి వాతావరణం, మంచు వల్ల గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు తెగులు మరింతగా వృద్ధి చెందుతుంది. పంట తొలిదశ నుంచి తోట నరికే వరకూ.. ఏ దశలోనైనా ఈ తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. నత్రజని ఎరువును అధిక మోతాదులో వాడితే.. తెగులు ఉధృతి మరింత పెరుగుతుంది.

తెగులు సోకిన మొక్కల్లో ఆకు అడుగుభాగంలో పసుపు లేదా నారింజ రంగులో బొబ్బలు ఎర్పడి ఒక మొక్క నుంచి దుబ్బులో ఉండే అన్ని మొక్కలనూ ఈ తెగులు ఆశిస్తుంది. ఇలా చేనులో అధికశాతం మొక్కలకు తెగులు వ్యాపిస్తుంది. తీవ్రత ఎక్కువైతే ఆకు తొడిమల మీద కూడా తుప్పు తెగులు బొబ్బలు కనపడతాయి. దూరం నుంచి చూస్తే తెగులు సోకిన మొక్కలు ముదురు గోధుమ రంగులో కనిపిస్తాయి. దీని నివారణ కోసం లీటర్‌ నీటిలో 3 గ్రా. మాంకోజెబ్‌ లేదా ఒక మి.లీ. ట్రైడిమార్ఫ్‌ కలిపి పిచికారీ చేసుకోవటం ద్వారా ఈ తెగులును తగ్గించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు