Seeding Cultivation Techniques
Seeding Cultivation : పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంత మంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. రబీ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావడానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్.
సాధారణంగా రైతాంగం సమతల మళ్ళలో నారును పెంచుతూ వుంటారు. ఈ విధానంలో మురుగునీటి సౌకర్యం లేకపోవటం వల్ల నారుకుళ్ళు తెగులు బెడద ఎక్కువగా వుండి, సకాలంలో నారు అందక, అదును తప్పటం.. మళ్ళీమళ్ళీ నారును పోయాల్సి రావటం వంటి పలు కారణాల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగేవి.
పైగా అదును తప్పటం వల్ల దిగుబడులు తగ్గి, రాబడి ఏమంత ఆశాజనంగా వుండేది కాదు. ఎత్తుమళ్ళలో నారుపెంపక విధానం ఈ సమస్యలను కొంత వరకు అధిగమించినా, చీడపీడల ఉధృతి ఎక్కువగా వుండటంతో… ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది.
అందుకే చాలా మంది రైతులు షేడ్ నెట్ లు, పాలీ హౌజ్ లు ఏర్పాటుచేసి కూరగాయల నారు మొక్కల పెంపకం చేపట్టి… రైతులకు అందిస్తూ.. మంచి లాభాలు పొందుతున్నారు. రైతులు సొంతంగా నారు పెంపకం చేపట్టాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా , ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హరికుమార్.
సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినపుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం వుంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు