Sorakaya Cultivation : 2 ఎకరాల్లో సొరసాగు.. నికర ఆదాయం రూ. 3 లక్షలు

పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్లీ అదేపంటను సాగుచేస్తూ ఉంటారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు. తోటి రైతులు సాగుచేసే పంటలనే సాగుచేస్తూ ఉంటారు. అందుకే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.

Sorakaya Cultivation

Sorakaya Cultivation : రైతులు ఏంట పండించినా, దానిని మార్కెట్ చేసుకునే విధానాన్ని బట్టే ఆదాయం వస్తుంది. ఒక సారి అధిక ధరలు పలికిన పంటలకు మరోసారి గిట్టుబాటు ధరలు కూడా పోతున్నాయి. అందుకే మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా మారాలి. ఇదే విషయాన్ని గమనించిన, తిరుపతి జిల్లాకు చెందిన  యువరైతు జోగి వినోద్ 2 ఎకరాల్లో సొర సాగుచేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Bitter Gourd Cultivation : పందిరి కాకర సాగుతో.. అధిక లాభాలు పొందుతున్ననెల్లూరు జిల్లా రైతు

పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, చాలా మంది రైతులు నష్టపోతూ ఉంటారు. అయినా మళ్లీ అదేపంటను సాగుచేస్తూ ఉంటారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటను గుర్తించరు. తోటి రైతులు సాగుచేసే పంటలనే సాగుచేస్తూ ఉంటారు. అందుకే నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కానీ తిరుపతి జిల్లా, సూళ్లూరు పేట మండలం, పాలెంపాడు గ్రామానికి చెందిన రైతు జోగి వినోద్  2 ఎకరాల్లో సొరసాగుచేస్తూ.. మంచి లాబాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Pomegranate Cultivation : దానిమ్మ సాగులో అధికదిగుబడి సాధించేందుకు జాగ్రత్తలు

రైతు వినోద్ చదివింది బిఎస్సీ అగ్రికల్చర్.. వ్యవసాయంపై ఉన్న మక్కువతో 20 ఎకరాల వ్యవసాయ భూమి కౌలులు తీసుకొని కూరగాయ పంటలను పండిస్తున్నారు. మార్కెట్ కు అనుగుణంగా పంటలను ఎంచుకుంటున్నారు. అతి తక్కువ ఎరువులు, పురుగుమందులు వాడుతూ.. పెట్టుబడులు తగ్గించుకోవడమే కాకుండా నాణ్యమైనద దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను తిరుపతి, చైన్నైకి ఎగుమతి చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.