Pomegranate Cultivation : దానిమ్మ సాగులో అధికదిగుబడి సాధించేందుకు జాగ్రత్తలు

జనవరి ఫిబ్రవరి మాసాలలో పూతనిచ్చే హస్తబహార్ కాపుకోసం జూన్ నెలనుండి నీటి తడులివ్వడం ఆపాలి. జూన్ నెలలో వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఈ పంట తీయడం కొంచెం కష్టంతోకూడుకున్నది.

Pomegranate Cultivation : దానిమ్మ సాగులో అధికదిగుబడి సాధించేందుకు జాగ్రత్తలు

pomegranate cultivation

Pomegranate Cultivation : తెలుగు రాష్ట్రాల్లో దానిమ్మ తోటల సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతుంది. అనుకూలమైన వాతావరణం ఉండడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. దానిమ్మను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తూ మంచి ఫలసాయాన్ని పొందుతున్నారు. దానిమ్మ సాగుకు నీటి వినియోగం చాలా తక్కువ. దానిమ్మ ఏడాది పొడవునా కాపునిస్తుంది. మార్కెట్ డిమాండ్, సాగునీటి లభ్యత, నేలస్వభావం, చీడపీడలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాపును తోటల్లో నిలుపు కుంటే రైతులు అధిక లాభాలను పొందేఅవకాశం ఉంది.

దానిమ్మ పంటకు అవసరమైన మేరకే నీరు అందించాలి. ఎక్కువ నీరు అందిస్తే కొత్త చిగుర్లు ఎక్కువగా వచ్చి బ్యాక్టీరియా,వైరస్ వ్యాధి ఉధృతమవుతుంది. దాంతో కాయ దిగుబడి పై తీవ్ర ప్రభావం పడుతుంది. దానిమ్మ మూడు సీజన్లలో పూతనిస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసాలలో వచ్చే పూతను బహార్ అని, జూన్ జూలైలలో వచ్చే పూతను హస్తబహార్ అంటారు. సాధారణంగా అంబేఐహార్, మిగ్బహార్ లో పూత ఎక్కువగా వస్తుంది. ఏదో ఒక సీజన్లో కాపును తీసుకోవడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. కాపు నియంత్రణ పద్దతి విషయానికి వస్తే చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి వేర్లను కత్తిరించడం,వేర్లను బహిర్గతం చేయడం, నీటినివ్వకుండా ఎందుబెట్టడం వంటి పద్ధతులను అనుసరించాలి. తద్వారా అవసరమైన సీజన్లో మాత్రమే కాపును పొందేందుకు అవకాశం ఉంటుంది.

జనవరి ఫిబ్రవరి మాసాలలో పూతనిచ్చే హస్తబహార్ కాపుకోసం జూన్ నెలనుండి నీటి తడులివ్వడం ఆపాలి. జూన్ నెలలో వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఈ పంట తీయడం కొంచెం కష్టంతోకూడుకున్నది. సెప్టెంబరులో చెట్లు బేట్టకు గురైనప్పుడు కొమ్మలు కత్తిరించి ఎరువులు వేసి నీరు పెడితే అక్టోబర్ మాసంలో పూతకు వచ్చి ఫిబ్రవరి మార్చి మాసాల్లో కాయ కోతకు సిద్ధమవుతుంది. దానిమ్మలో కాయ నాణ్యత, సైజు పెంచడానికి తప్పనిసరిగా పూత కాయలను పలుచన చేయాలి. 6 సంవత్సరాల వరకు 30-50 కాయలు, ఆపైన 60 కాయలవరకు ఉండవచ్చు.కొన్ని రసాయనాలు వాడటం ద్వారా పూత, పిందె రాలునట్లు చేయవచ్చు. ఇథేఫాన్ 2000 పిపిఎమ్ రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయడం ద్వారా పూత, పిందె రాలేటట్లు చేయవచ్చు. అయితే రసాయనాలు వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. మోతాదుకు మించి వాడినట్లయితే పూత మొత్తం రాలిపోయే ప్రమాదం ఉంది.

దానిమ్మలో భూమిలో గల తేమలో హెచ్చు తగ్గులు అధికంగా ఉన్నప్పుడు కాయలో పగుళ్లు ఏర్పడతాయి. కాయ ఎదిగే దశలో 100 లీటర్ల నీటికి ఒక కిలో కాల్షియం క్లోరైడు మరియు ఒక కిలో మెగ్నీషియం క్లోరైడ్ కలిపినా ద్రావణాన్ని పిచికారి చేసి ఆ తర్వాత ఒకటిన్నర కిలోల డి.ఎ.పి మరియు 0 . 5 కిలో మెగ్నీషియం సల్పెటు 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసి కాయ పగుళ్ళను నియంతరించవచ్చు. అవసరం అయితే 90 మీ.లి. సైటో జెమ్, 100 గ్రాముల బొరాక్స్, 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

కాబట్టి దానిమ్మ సాగు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి సరైన సమయానికి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక నాణ్యమైన దిగుబడులు సాధించటంతోపాటు, అధిక అదాయాన్ని పొందవచ్చు.