Post Office Scheme : పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్.. ఒకేసారి రూ. లక్ష డిపాజిట్ చేస్తే చాలు.. ప్రతినెలా ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Post Office Scheme : పోస్టాఫీస్ కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.6 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రయోజనాలు పొందవచ్చంటే?

Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్ (Post Office Scheme) అందిస్తోంది. అందులో RD, TD, MIS, PPF, కిసాన్ వికాస్ పత్ర వంటి అనేక రకాల అకౌంట్లను పోస్టాఫీసులో ఓపెన్ చేయొచ్చు.
పోస్టాఫీస్ MIS అంటే.. నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడిదారులు ప్రతి నెలా స్థిర వడ్డీని పొందవచ్చు. ఈ వడ్డీ డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో క్రెడిట్ అవుతుంది. పోస్టాఫీస్ MIS పథకంలో రూ. లక్ష జమ చేస్తే.. ప్రతి నెలా ఎంత వడ్డీ వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోస్టాఫీస్ MIS పథకం.. 7.6 శాతం వడ్డీ :
పోస్టాఫీస్ కస్టమర్లకు నెలవారీ ఆదాయ పథకంపై 7.6 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. పోస్టాఫీస్ MIS పథకంలో కనీసం రూ. 1000 డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం కింద సింగిల్ అకౌంటులో గరిష్టంగా రూ. 9 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంటులో గరిష్టంగా ముగ్గురిని చేర్చవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం డబ్బు మెచ్యూరిటీ తర్వాత తిరిగి పొందవచ్చు.
పోస్టాఫీసులో SIS అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీకు ముందుగా పోస్టాఫీసులోనే సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. మీరు ఇంకా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే MIS పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. సేవింగ్స్ అకౌంట్ తప్పక ఓపెన్ చేయాలి. ఈ పథకం 5 ఏళ్లలో మెచ్యూరిటీ చెందుతుంది. మీరు రూ. లక్ష డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ. 633 ఫిక్స్‌డ్ వడ్డీ పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. లక్ష తిరిగి పొందవచ్చు.