Sorghum Cultivation : రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక, పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిన్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో పత్తి, సోయా వేసే రైతులు రెండో పంటగా జొన్నను సాగుచేస్తున్నారు. అయితే ఇప్పటికే విత్తిన రైతులు… ఇంకా విత్తబోయే రైతులు తొలిదశ నుండి ఆశించే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలని సమగ్ర సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
తెలంగాణ మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా జొన్నను రైతులు సాగుచేస్తూ ఉంటారు. ఈ పంటను ప్రధానంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నప్పటికీ … మెట్ట ప్రాంతాల్లో , తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాలలో వాతావరణంలో మార్పులను తట్టుకొని కనీస దిగుబడినిచ్చేటటువంటి పంట.
Read Also : Bananna Cultivation : ఆయిల్ ఫాంలో అంతర పంటగా అరటి సాగు
అందుకే ఆదిలాబాద్ జిల్లాల్లో సోయాపంట తిసిన వెంటనే రైతులు రెండో పంటగా విత్తారు. ప్రస్తుతం పత్తి పంటను తీసివేసిన రైతులు ఇప్పుడిప్పుడే నాటుతున్నారు. అయితే తొలిదశనుండే చీడపీడలపట్ల జాగ్రత్తగా ఉండాలని సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.
సోయా, పత్తి తరువాత జొన్న సాగు :
విత్తన శుద్ధి థయోమిథాక్సామ్ 4 గ్రా. లేదా
ఇమిడాక్లోప్రిడ్ 2.5 -3 మి. లీ.
1 కిలో విత్తనానికి పట్టించాలి
చెదలు, వేరుపురుగు నివారణ
క్లోరిపైరిఫాస్ 6 మి. లీ.
1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేయాలి
థైరమ్ 3 గ్రా. 1 కిలో విత్తనానికి పట్టించాలి
ఆకుమచ్చ, ఆకు ఎండు తెగులు నివారణ
కార్బాక్సిమ్ + థైరమ్
విటావ్యాక్స్ పవర్ 2.5 గ్రా.
1 కిలో విత్తనానికి పట్టించి
విత్తన శుద్ధి చేయాలి
కత్తెర పురుగు నివారణ :
కాండపుఈగ, కాండం తొలిచే పురుగుల నివారణ
ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జి గుళకలు 3 కి.
మొక్క సుడుల్లో వేసుకోవాలి
ఎకరాకు లింగాకర్షక బుట్టలు 4 అమర్చుకోవాలి
అజాడిరక్టిన్ 1500 పిపిఎం 5 మి. లీ.
లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
Read Also : Pest Management in Groundnut : వేరుశనగలో సమగ్ర సస్యరక్షణ చర్యలు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు