Organic Farmer : ప్రకృతి విధానంలో అంతర పంటల సాగు

అందులోనే 4 రకాల అంతర పంటలు బాడర్ క్రాప్ గా మరో రెండు పంటలున్నఈ వ్యవసాయ క్షేత్రం  ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, గాదెపాలెం గ్రామం ఉంది. దీనిని సాగుచేస్తున్న రైతే జాన్సీ లక్ష్మీ.

Organic Farmer : పంటల సాగులో అధికోత్పత్తి సాధించడమే రైతు యొక్క చిట్టచివరి లక్ష్యం. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన నేపధ్యంలో నిరంతరం అధిక ఆదాయం వచ్చే దిశగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. అయితే ఈ విధానంలో రైతుల పర్యవేక్షణ తప్పనిసరి ఉండాలి అప్పుడే మంచి లాభాలను గడించవచ్చు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో  మిశ్రమ పంటలు సాగుచేస్తూ… ఏడాది పొడవునా దిగుబడులను తీస్తున్నారు. తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.

ఇదిగో ఈ వ్యవసాయ క్షేత్రం చూడండీ.. తీరొక్క పంటలు కనిపిస్తున్నాయి కదూ.. ప్రధాన పంటగా శనగను సాగుచేస్తూ.. అందులోనే 4 రకాల అంతర పంటలు బాడర్ క్రాప్ గా మరో రెండు పంటలున్నఈ వ్యవసాయ క్షేత్రం  ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, గాదెపాలెం గ్రామం ఉంది. దీనిని సాగుచేస్తున్న రైతే జాన్సీ లక్ష్మీ.

రైతు జాన్సీ లక్ష్మీ తనకున్న ఎకరం పొలంలో రబీలో ప్రధాన పంటగా శనగను సాగుచేశారు. అయితే వాతావరణ మార్పులు , కారణంగా చీడపీడల వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అంతర పంటలను సాగుచేస్తే , ఒక పంట నష్టపోయినా మరోపంటతో ఆనష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆలోచించి అంతర పంటలను సాగుచేయాలనుకున్నారు. ఇందుకోసం తక్కువ సమయంలోనే చేతికొచ్చే దనియాలు , పొద్దుతిరుగుడు , వరిగి, గోరుచిక్కుడు పంటలను అంతర పంటలుగా సాగుచేశారు. వీటికి చీడపీడలు ఆశించకుండా ఉండేందుకు రక్షక పంటలుగా జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలను బాడర్ క్రాప్ గా సాగుచేశారు.

వీటితో పాటు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టను పొలంలో అమర్చి… చీడపీడల నుండి పంటను కాపాడుతున్నారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. అతి తక్కువ ఖర్చుతో ఎకరంపై లక్షరూపాయల నికర ఆదాయం పొందుతూ.. చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

అంతర పంటలతో భూములకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రెండు పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. అంతేకాదు తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ట్రెండింగ్ వార్తలు