Farmer Success Story : చెరకు తోటలో యువ రైతు అద్భుతమైన ప్రయోగం.. రెండెకరాల్లో దానిమ్మ తోటతో లక్షల్లో లాభం

రెండెకరాల్లో వేసిన దానిమ్మ పంట ద్వారా 25 లక్షల ఆదాయం వస్తుందని శంకర్ లత్కే చెబుతున్నారు. ప్రస్తుతం దానిమ్మ తోటలో చేతికి రావాల్సిన దానిమ్మ పంట ఇంకా ఉంది మిగిలిన పంటను కిలోకు రూ.100 చొప్పున అమ్ముకోవచ్చని రైతు ఆశాభం వ్యక్తం చేస్తున్నారు.

Pomegranate

Farmer Success Story : ఇటీవలి కాలంలో కొందరు రైతులు సంప్రదాయ పంటలు పక్కన పెట్టి ఆధునిక పద్ధతుల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. సరైన ప్రణాళిక ,తక్కువ ఖర్చుతో మంచి పంటల ఉత్పత్తిని పొందుతున్నారు. షోలాపూర్ జిల్లా మాదా తాలూకాలోని కేవాడ్‌కు చెందిన యువ రైతు ఇదే తరహాలో విభిన్న ప్రయోగాన్ని చేసి సక్సెస్ అయ్యాడు. శంకర్ భగవాన్ లట్కే అనే రైతు రెండు ఎకరాల్లో దానిమ్మ సాగుతో రాత్రికి రాత్రే లక్షల్లో లాభం పొందాడు. ఈ రైతు చేసిన విన్నూత్న ప్రయోగం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 10 టన్నుల దానిమ్మ పండ్లను విక్రయించారు.

READ ALSO : Cotton Crop : పత్తిచేలలో వర్షపు నీరు.. చీడపీడలు సోకే అవకాశం

ఇక వివరాల్లోకి వెళితే సినా నది వెంబడి పెద్ద ఎత్తున చెరకు సాగవుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చెరుకు పొలాలే కనిపిస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా చెరకు పంటనే రైతులు సాగు చేస్తూ తమ వ్యవసాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే వర్షాలు తగినంతగా పడకపోతే మాత్రం చెరుకు పంటను సాగు చేయటం కష్టంగా మారుతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. దీంతో కొందరు రైతులు తక్కువ నీటితోనే చెరకు పంటను సాగు చేస్తుంటారు.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

కేవాడ్‌కు చెందిన శంకర్ పాటిల్ అలియాస్ లత్కే అనే రైతు దానిమ్మ సాగులో ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. ఒకవైపు చెరకు సాగు చేస్తూనే మరోవైపు దానిమ్మసాగు చేసేవారు. శంకర్ లత్కే తనకున్న రెండు ఎకరాల భూమిలో దానిమ్మ వేశాడు. ఇప్పటి వరకు 10 టన్నుల దానిమ్మ పండ్లను విక్రయించాడు. దానిమ్మ కిలో రూ.110 ధర పలికింది. ఇంకా 15 టన్నుల పంట చేతికందాల్సి ఉందని శంకర్ లట్కే తెలియజేశారు. రూ.25 లక్షల ఆదాయం వస్తుందని అంచనా అంచనా వేస్తున్నాడు.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

రెండెకరాల్లో వేసిన దానిమ్మ పంట ద్వారా 25 లక్షల ఆదాయం వస్తుందని శంకర్ లత్కే చెబుతున్నారు. ప్రస్తుతం దానిమ్మ తోటలో చేతికి రావాల్సిన దానిమ్మ పంట ఇంకా ఉంది మిగిలిన పంటను కిలోకు రూ.100 చొప్పున అమ్ముకోవచ్చని రైతు ఆశాభం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అందరిలాగే తాను కూడా చెరకు సాగుచేపట్టేవాడినని, ఉజని డ్యాంలో నీరు లేకపోవడంతో దానిమ్మ సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు శంకర్ లత్కే తెలిపారు.

READ ALSO : Crave Crops : పంటలను ఆశించే చీడ పీడలను ఆకర్షించే ఎరపంటలు!

వర్షాలు సరిగా లేకపోవటం చెరకు రైతులను దెబ్బతీశాయి ;

ఉజని డ్యాం వల్ల షోలాపూర్ జిల్లా రైతులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. పూణె జిల్లాలో మంచి వర్షాలు కురిస్తే కాని ఉజని డ్యామ్ పూర్తి స్థాయిలో నిండదు. వర్షకాలు లేకపోవటం వల్ల డ్యాంలో నీరు లేకపోవటం వల్ల పంటకాలువలకు నీటి విడుదల సాధ్యం కావడం లేదు. దీంతో చెరకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది రైతులు తక్కువ నీటితో పంటలు పండించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటంతో దీంతో ఉజని డ్యాం పూర్తి స్థాయిలో నిండలేదు. సినా నది వెంబడి ఉన్న చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.