Mango Planting : మామిడి మొక్కలు నాటటానికి అనువైన కాలం, నాటిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మామిడి చాలా లోతైన వేరు వ్యవస్థ కలిగిన చెట్టు అందువలన భూమి లోపలి పారల నుండి పోషకాలను, నీటిని గ్రహించి మనగలదు. కానీ ప్రతి ఏడాది నిలకడగా, మంచి నాణ్యత కలిగిన కాపు నివ్వటానికి, కాయల ద్వారా పాగొట్టుకున్న పోషకాలను తిరిగి పొందటానికి, వాణిజ్య సరళీలో సాగు చేయుటకు ప్రతి సంవత్సరము ఎరువులను వేయటం తప్పనిసరి.

Mango planting

Mango Planting : మనదేశం మామిడి పండ్ల సాగులో ప్రపంచంలోనే మొదటి స్దానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను ఎక్కువగానే సాగు చేస్తున్నారు. మామిడి పండ్లను తినటానికి, పచ్చళ్ళ తయారీకి, జ్యూస్ గా వినియోగిస్తారు. ఈ పంటసాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రాంతాలను బట్టి వివిధ మామిడి రకాలను రైతులు సాగు చేస్తున్నారు.

READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

మొక్కలు నాటటానికి అనువైన కాలం :

మామిడి మొక్కలను. జూన్‌ నుండి డిసెంబరు వరకు నాటుకోవచ్చును. తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో జూన్‌-జూలై లోను, ఎక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో అక్టోబరు-నవంబరు, మాసాలలో నాటుకోవాలి. అంటు మొక్కను, మట్టితో సహ తీసి, వేర్లు కదలకుండా, గుంత మధ్యలో నాటి, మట్టితో గట్టిగా నొక్కి గాలికి పడిపోకుండా చిన్న కర్ర పాతి కదలకుందా కట్టాలి. నాటిన వెంటనే 1.5 అడుగుల వెడల్పు పాదులు చేసి నీరు ఇవ్వాలి. అంట్లు నాటేటప్పుడు, అంటు కట్టిన భాగం భూమిపై నుండి 10 సెం.మీ ఉండాలి.

నాటిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

నేల రకాన్ని బట్టి క్రమ పద్ధతిలో మొక్క చుట్టూ పాదులు చేసుకొని నీరు ఇవ్వాలి. అంటుభాగం క్రింద అనగా వేరు మూలంపై చిగుర్లు వేస్తే వాటిని తొలగించాలి. అంట్లు కుదురుకోని చోట మరల అంట్లు నాటుకోవాలి. అంట్లు సుమారు 1 మీ. ఎత్తు పెరిగినవ్వుడు కొనను గిల్లివేస్తే మొక్క శాఖీయంగా బాగా పెరుగుతుంది. అంటు కట్టిన మొక్కలు ఒక సంవత్సరం తరువాత పుష్ఫించడం ప్రారంభిస్తాయి. వీటిని కాపు కాయనిస్తే మొక్క పెరుగుదల దెబ్బతింటుంది. కాబట్టి మొదటి ౩-4 సంవత్సరాల వరకు పువ్వులను తుంచి వేయాలి. ప్రధాన కాండం మీద 60 సెం.మీ ఎత్తు వరకు ప్రక్క కొమ్మలు పెరుగకుండా చూసుకోవాలి. ఇది చెట్టు సరైన అకారం రూపొందటానికి దోహదపడుతుంది.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

ఎరువుల వాడకం :

మామిడి చాలా లోతైన వేరు వ్యవస్థ కలిగిన చెట్టు అందువలన భూమి లోపలి పారల నుండి పోషకాలను, నీటిని గ్రహించి మనగలదు. కానీ ప్రతి ఏడాది నిలకడగా, మంచి నాణ్యత కలిగిన కాపు నివ్వటానికి, కాయల ద్వారా పాగొట్టుకున్న పోషకాలను తిరిగి పొందటానికి, వాణిజ్య సరళీలో సాగు చేయుటకు ప్రతి సంవత్సరము ఎరువులను వేయటం తప్పనిసరి. చెట్ల వయస్సును బట్టి ఎరువులు వేయటం జరుగుతుంది.

భూసార పరీక్ష పత్ర విశ్లేషణను అనుసరించి ఎరువుల వాడకం మంచిది. రసాయనిక ఎరువుల కంటే, సేంద్రియ. ఎరువులను ఎక్కువగా వాడాలి. అందువలన నేల భౌతిక లక్షణాలు, నీటిని నిల్వ ఉంచే శక్తి, సేంద్రియ పదార్ధం, సూక్ష్మజీవుల చైతన్యం పెరుగుతాయి. ముఖ్యంగా కాయల నాణ్యత పెరుగుతుంది. సేంద్రియ ఎరువులను ఒకే దఫాగా మొత్తం కాయ కోత మరియు కత్తిరింపుల తర్వాత జూలై/ మాసాల్లో వేయాలి. రసాయనిక ఎరువులను 2 లేదా ౩ దఫాలుగా వేయాలి. వర్షాధారిత వంటకు వర్నప్రాతాన్ని బట్టి, కురిసే కాలాన్ని బట్టి, ఒకటి లేదా రెండు దఫాలుగా వేయాలి. నీటి పారుదల కింద సాగు అయ్యే తోటలకు నీటి లభ్యతను బట్టి 2 లేదా ౩ దఫాలుగా ఎరువులు వేయాలి.

READ ALSO : Corn Farming : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

మొదటిసారి జూలై/ఆగప్టు మాసాల్లో సేంద్రియ ఎరువులతో పాటు సగం నత్రజని, భాస్వరం, పొటాష్‌ వూర్తి మోతాదులో వేయాలి. రెండో దఫా సెప్టెంబరు/అక్టోబరు మాసాల్లో వరాన్ని బట్టి మిగిలిన సగ భాగం నత్రజనిని వేయాలి. మూడు దఫాలుగా ఎరువులు వేయాల్సి వచ్చినప్పుడు నత్రజని మోతాదును 3 భాగాలుగా, పొటాష్‌ను రెండు భాగాలు వేయాలి. చివరి దఫా నత్రజని, పొటాష్‌ ఎరువులను మామిడి కాయలు, గోళీ సైజు లో ఉన్నప్పుడు వేసుకోవాలి.

ఒక సంవత్సరం వయస్సు ఉన్న ఒక్కొక్క చెట్టుకు 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాన్వరం, 160 గ్రా. పొటాష్‌ ఇచ్చే. ఎరువులు వేయాలి. అటు తర్వాత ప్రతి సంవత్సరం ఎరువుల మోతాదును 100 గ్రా. చొప్పున పెంచుకుంటూ 10వ సంవత్సరానికి కిలో నత్రజని, కిలో భాస్వరం, కిలో పొటాష్‌ నిచ్చే ఎరువులను వేయాలి.