Summer Ridge Gourd Cultivation : వేసవి బీర సాగులో మెళకువలు.. పందిరి కూరగాయలతో అధిక ఆదాయం
Summer Ridge Gourd Cultivation : వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
- Sreehari A
- Published On : March 13, 2024 / 03:02 PM IST
Summer ridge gourd cultivation tips
Summer Ridge Gourd Cultivation : వేసవి వచ్చిందంటే చాలు కూరగాయల ధరలు మండిపోతాయి. ముఖ్యంగా తీగజాతి కూరగాయలైన బీర, సొర, దొండ, కాకర, దోస పమటలకు డిమాండ్ ఎక్కువ. నీటి వసతి ఉన్న రైతులు అధికంగా బీరను సాగుచేస్తూ.. ఉంటారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మొక్కలు సరిగ్గా ఎదగకపోవడం.. ఇటు చీడపీడలు అధికంగా ఆశించి, దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
Read Also : Mustard Cultivation : ఆవాల సాగుకు అనువైన ప్రాంతం విశాఖ ఏజెన్సీ
కాబట్టి.. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎన్నుకొని, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చని తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, కో ఆర్డినేటర్ శివకృష్ణ.
మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. :
బీర.. తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీలు కూడా అవసరం లేదు. ఒకే వ్యక్తి ఒక రోజులో క్వింటాలు వరకు బీరకాయలను తెంపగలుగుతారు. అదే ఇతర పంటలైతే ముగ్గురు, నలుగురు కూలీలు అవసరమవుతారు. ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు.
వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి వేసవిలో బీరను సాగుచేసిన, చేయబోతున్న రైతులంతా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు వీలుంటుంది. వేసవి బీరసాగులో ఎలాంటి మెళకులు పాటించాలో రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, కో ఆర్డినేటర్ శివకృష్ణ.
వేసవిలో పంట ఎదుగుదల తగ్గి, పూత రాలిపోయే అవకాశం ఉంటుంది . అంతే కాకుండా ఎక్కువగా తెగుళ్లు ఆశిస్తుంటాయి. కాబట్టి సకాలంలో నీటితడులు, పోషకాలు అందించాలి. చీడపీడలను గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
Read Also : Paddy Cultivation : ప్రకృతి విధానంలో జైశ్రీరాం రకం వరి సాగు
