Paddy Cultivation : ప్రకృతి విధానంలో జైశ్రీరాం రకం వరి సాగు

Paddy Cultivation : దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అనర్థాలకు దారితీస్తోంది. భూమిలో సత్తువ తగ్గి.. దిగుబడులు నానాటికి పడిపోతున్నాయి.

Paddy Cultivation : ప్రకృతి విధానంలో జైశ్రీరాం రకం వరి సాగు

Jai Shri Ram Paddy Cultivation

Paddy Cultivation : మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధికశాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు… 8 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి పండిస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని.. సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరుపిస్తున్నారు

Read Also : Paddy Cultivation : వరిలో అగ్గి తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు  

దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం అనర్థాలకు దారితీస్తోంది. భూమిలో సత్తువ తగ్గి.. దిగుబడులు నానాటికి పడిపోతున్నాయి. వచ్చిన దిగుబడికి మార్కెట్ లో గిట్టుబాటు దక్కక..  రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయంవైపు రైతుల అడుగులు పడుతున్నాయి. ఇలా 8 ఏళ్ల క్రితం అరఎకరంలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టిన నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, వడ్లపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, పుష్ఫ రైతు దంపతులు నేడు 5 ఎకరాలకు విస్తరించారు.

తనకున్న దేశీ ఆవుల నుండి వచ్చే వ్యర్థాలతో పంట పొలాలకు అందిస్తూ.. వరి పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా సన్నరకమైన జైశ్రీరాం వంగడాన్ని ఎంచుకొని.. అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని నేరుగా బియ్యం పట్టించి.. క్వింటాకు రూ. 7 వేల చొప్పున అమ్ముతూ.. అధిక లాభాలు పొందుతున్నారు.

మారిన జీవన శైలిలో ప్రకృతి సాగు పంటలు అవసరమవుతున్నాయి. ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ.. అధిక దిగుబడులను రాబట్టడంలో ఈ రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక వరిపంటనే పండించిన రైతులు ఈ సారి కూరగాయలను కూడా పండిస్తున్నారు. వీరుసాగులో సాధించిన విజయాలను అనేక సంస్థలు గుర్తించి ఉత్తమరైతులగా  అవార్డులతో సత్కరించాయి.

Read Also : Mixed Farming : ఆర్థిక భరోసానిచ్చే మిశ్రమ వ్యవసాయం