Mustard Cultivation : ఆవాల సాగుకు అనువైన ప్రాంతం విశాఖ ఏజెన్సీ

Mustard Cultivation : వరిని ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగుచేస్తుంటారు రైతులు. ముఖ్యంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వరి సాగవుతోంది. అయితే ఎజెన్సీ ప్రాంతంలోని రైతులు రెండో పంటను సాగుచేయరు.

Mustard Cultivation : ఆవాల సాగుకు అనువైన ప్రాంతం విశాఖ ఏజెన్సీ

Mustard Cultivation

Mustard Cultivation : విశాఖ ఏజెన్సీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలంయ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో రబీకి అనువైన  పలు రకాల పంటల సాగును ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. అయితే ఆవాల పంట ఆశాజనకంగా ఉండటంతో వీటి సాగుపట్ల రైతులకు త్వరలోనే అవగాహన కల్పిస్తున్నారు.

Read Also : Inter Crop Cultivation : 2 ఎకరాల్లో బొప్పాయి.. ఎకరంలో బంతి సాగు.. ఆదాయం రూ. 23 లక్షలు

ఆహార పంటల్లో ముఖ్యమైనది వరి. అలాంటి వరిని ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగుచేస్తుంటారు రైతులు. ముఖ్యంగా విశాఖ జిల్లా మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో వరి సాగవుతోంది. అయితే ఎజెన్సీ ప్రాంతంలోని రైతులు రెండో పంటను సాగుచేయరు.

విశాఖ ఏజెన్సీలో ప్రయోగత్మకంగా ఆవాల సాగు : 
దీంతో పంట కాలం నష్టపోకుండా, రెండో పంటను వేయించి, వారి ఆర్ధిక పరిస్థితి మెరుగు పరిచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ స్థానం ప్రయోగాత్మకంగా 4 పంటలను సాగుచేస్తున్నారు శాస్త్రవేత్తలు . అందులో ఒకటి ఆవాలు. ఇతర పంటలతో పోల్చితే ఆవాల పంట ఇవి ఈ ప్రాంతానికి అనువైనవిగా చెబుతున్నారు. ఇక నుండి  ఇక్కడి రైతులతో రబీపంటగాను ఆవాలను సాగుచేయించేదుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.

Read Also : Kharbuja Cultivation : వేసవిలో మంచి డిమాండ్.. కష్టాలు తీర్చుతున్న కర్బుజా సాగు