Kharbuja Cultivation : వేసవిలో మంచి డిమాండ్.. కష్టాలు తీర్చుతున్న కర్బుజా సాగు

Kharbuja Cultivation : వేసవిలో పుచ్చ, ఖర్బూజకు మంచి డిమాండ్ ఉండటంతో.. గత ఏడాది నుండి ఖర్బూజ సాగుచేస్తున్నారు. బెడ్డింగ్‌విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి, సాగు చేపట్టారు.

Kharbuja Cultivation : వేసవిలో మంచి డిమాండ్.. కష్టాలు తీర్చుతున్న కర్బుజా సాగు

muskmelon farming more demand in summer season

Kharbuja Cultivation : వేసవి వచ్చిందంటే చాలు అందరికి గుర్తుకొచ్చేది పుచ్చ, తర్బుజ. ఈ సీజన్ లో వీటిని సాగుచేసేన రైతులకు సిరుల పంటే. అందుకే చాలామంది రైతులు సీజనల్ గా వీటి సాగుచేపడుతుంటారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు రెండేళ్లుగా ఖర్బూజ సాగుచేపడుతున్నారు. కొచెం రిస్క్ ఎక్కువే అయినా… తక్కువ సమయంలో అధిక లాభాలను పొందవచ్చు.

Read Also : Paddy Cultivation : వరిలో అగ్గి తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు  

కనుచూపు మేర కనిపిస్తున్న ఈ ఖర్బూజ పంట ఏలూరు జిల్లా, ముసునూరు గ్రామానికి చెందిన రైతు రేగుల వెంకట నర్సింహారావు ది. తనకున్న మూడున్నర ఎకరాలతో పాటు మరో 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. కంద, అరటి, బొప్పాయి పంటలను ఎక్కువగా సాగుచేస్తూ ఉంటారు.

అయితే వేసవిలో పుచ్చ, ఖర్బూజకు మంచి డిమాండ్ ఉండటంతో.. గత ఏడాది నుండి ఖర్బూజ సాగుచేస్తున్నారు. బెడ్డింగ్‌విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి, సాగు చేపట్టారు. కలుపు సమస్య తగ్గడమే కాకుండా, నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఖర్బూజ సాగు ఆశాజనకంగా ఉందంటున్నారు.

దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తే పెట్టుబడులు అధికంగా ఉంటాయి. కూలీలు చాలా ఉంటుంది. అందుకే తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికొచ్చి, డబ్బులు చేతికొచ్చే  పంటలను సాగుచేయడం వల్ల రైతు ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడు. రైతు వెంకట నర్సింహారావు చేసింది కూడా అదే.. మిగితా రైతులు కూడా ఈ రైతు దారిలో పయనిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు.

Read Also : Cashew Manufacturing : స్వయం ఉపాధిగా జీడిపప్పు తయారీ