Soya Cultivation : ఖరీఫ్‌లో వర్షాధారంగా సోయాచిక్కుడు సాగు.. విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన మెళకువలు 

Soya Cultivation : తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ ,సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఈ పంట అత్యధికంగా సాగులో వున్నా గత మూడేళ్లుగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది..

Soya Cultivation : ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే సోయాచిక్కుడును ఇటీవలికాలంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల రైతులు కూడా సాగుచేసేందుకు  ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువకాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పుజాతి పంట సోయాచిక్కుడు . ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే వీలుంది. ప్రస్థుతం క్వింటాకు 4400 నుండి 5200 రూపాయల ధర లభిస్తోంది. ఈ పంటసాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం వుండటంతో చాలామంది రైతులు సోయా సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే  రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రాంనగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఎం. రాజేందర్ రెడ్డి.

Read Also : Vegetable Cultivation : మిశ్రమ కూరగాయల సాగులో అధిక లాభాలు

రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయాచిక్కుడు ఒకటి.  ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పుజాతి పంట. అయితే నూనెగింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత వుంది. నూనెలో కొవ్వుశాతం తక్కువ వుండటం వల్ల ఆరోగ్యానికి  చాలా మంచిది. నూనె తీసిన సోయా పిండిలో 50 – 60 శాతం మాంసకృతులు వుండటం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడిసరుకుగా  వాడుతున్నారు. తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ ,సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలలో ఈ పంట అత్యధికంగా సాగులో వున్నా గత మూడేళ్లుగా ఇతర జిల్లాలకు కూడా విస్తరించింది..

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లో దీని సాగు విస్తీర్ణం తక్కువ వుంది. అయితే ఏటా ప్రకాశం, గుంటూరు , అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో ఏటా ఈ పంట విస్తీర్ణం పెరుగుతోంది . తెలంగాణాలో సోయాచిక్కుడు సాగుకు  జూన్ 15 నుండి జూలై 15 వరకు అనుకూల సమయం. కోస్తా జిల్లాల్లో ఆగష్టు సెప్టెంబరు వరకు విత్తుకోవచ్చు. సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా వుంటాయి. తెలంగాణలో ఎక్కువమంది రైతులు వర్షాధారంగా సాగుచేస్తున్నారు .  ప్రస్థుతం సోయాచిక్కుడు విత్తేందుకు అనుకూలం  సమయం. అయితే అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక ముఖ్యమని తెలియజేస్తున్నారు  ఆదిలాబాద్ జిల్లా, రాంనగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఎం. రాజేందర్ రెడ్డి.

సోయాచిక్కుడును ఏ విధంగా విత్తినా ఎకరాకు  లక్షా 60వేల మొక్కలు వుండేటట్లు చూసుకుంటే దిగుబడి ఆశాజనకంగా వుంటుంది. విత్తిన వెంటనే ఎకరాకు 1.4 లీటర్ల పెండిమిథాలిన్ మందును  200 లీటర్ల నీటిలో కలిపి పిచికారిచేయాలి. విత్తిన 20 నుండి 25 రోజులతు గొర్రుతో అంతర కృషి చేసి కలుపును నివారించాలి. దీనివల్ల మొక్కల మొదళ్లకు మట్టి ఎగదోయబడి, వేర్లు గాలిపోసుకుని  పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది.

సోయాచిక్కుడును  వర్షాధారంగా సాగుచేసినప్పటికీ, నీటి వసతి వున్న రైతాంగం, పైరు 20 రోజుల దశలో ఒకసారి, కాయ అభివృద్ధి చెందే దశలో మరోసారి  నీటి తడి అందించినట్లయితే  అధిక దిగుబడి సాధించవచ్చు. సోయాచిక్కుడును  ఇతర పంటలతో కలిపి అంతరపంటగా  సాగుచేయవచ్చు . ఈ పంటకు రసం పీల్చు పురుగులు, ఆకుముడత, పెంకు పురుగుల సమస్య అధికంగా వుంటుంది. వీటి నివారణకు సకాలంలో  తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే పైరు ఆరోగ్యంగా  పెరిగి మంచి ఫలితాలను అందిస్తుంది.

Read Also : Vegetable Cultivation : ఎకరన్నరలో టమాట, దోస, పచ్చిమిర్చి సాగు

ట్రెండింగ్ వార్తలు