Vegetable Cultivation : ఎకరన్నరలో టమాట, దోస, పచ్చిమిర్చి సాగు

Vegetable Cultivation : ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావడం  మార్కెట్ లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయాన్ని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Vegetable Cultivation : ఎకరన్నరలో టమాట, దోస, పచ్చిమిర్చి సాగు

Vegetable Cultivation

Vegetable Cultivation : అతి తక్కువ సమయం.. తక్కువ ఖర్చుతో  అధిక ఆదాయం వచ్చే  పంటలలో కూరగాయలది మొదటి స్థానంగా అని చెప్పవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా, ఒక కోతలో కాకపోతే మరో కోతలో.. ఒక పంటలో కాకపోతే మరో పంటలో మంచి ధరలు పలుకుతుండటంతో.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరన్నరలో ప్రణాళిక బద్ధంగా, టమాట, దోస, పచ్చిమిర్చి సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభమయ్యాయి. వేసవి కావడం  మార్కెట్ లో ధరలు కూడా బాగుండటంతో మంచి ఆదాయాన్ని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ఇదిగో ఇక్కడ చూడండీ.. వరుసగా పలు కూరగాయ తోటలను. మొత్తం ఎకరన్నరలో 3 రకాల  పంటలను ప్రణాళిక బద్దంగా సాగుచేస్తున్న ఈ రైతు కాశీ విశ్వేశ్వరరావు. పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం, పెద తాడేపల్లి గ్రామానికి చెందిన ఈయన సీజన్ కు అనుగుణంగా పంటలను పండిస్తూ ఆర్ధికంగా సత్ఫలితాలు నమోదుచేస్తున్నాడు.

టమాట, దోస, మిరప ఇలా  ఒకే పొలంలో వరుసగా పంటలను సాగుచేస్తూ ఆదర్శవంతమైన సేద్య విధానానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ క్షేత్రం. ఈ తోటలో సంవత్సరం పొడవునా దిగుబడి వస్తుంది. పంట వెనుక మరో పంట వేయటం వల్ల ఖర్చు కూడా తగ్గుతోంది. ఒక ఎకరన్నరలో బోదెలపై డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేశారు. అర ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాట, మరో అర ఎకరంలో దోస, అర ఎకరంలో పచ్చిమిర్చి విత్తారు.

పంటలకు డ్రిప్ ద్వారానే ఎరువులు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు చీడపీడలను గమనిస్తూ.. సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వేసవిలో కూడా పంటలు ఆరోగ్యంగా పెరిగాయి. ప్రస్తుతం పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ లో మంచి ధర పలుకుతోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లలో అమ్ముతున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు