Vegetable Cultivation : మిశ్రమ కూరగాయల సాగులో అధిక లాభాలు

వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకుంటున్నారు. కొన్నేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులూ ఇదే నిజమని చెబుతున్నారు.

Vegetable Cultivation : మిశ్రమ కూరగాయల సాగులో అధిక లాభాలు

growing vegetables for farmers market

Vegetable Cultivation : మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా పంటలు పండిస్తున్నారు. అయితే ఒకే పంట కాకుండా మిశ్రమ కూరగాయలు సాగుచేస్తే.. చీడపీడల ఉదృతి తగ్గడమే కాకుండా ప్రతి రోజు ఏదో పంటపై ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

వ్యవసాయంలో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకుంటున్నారు. కొన్నేండ్లుగా కూరగాయలు సాగు చేస్తున్న రైతులూ ఇదే నిజమని చెబుతున్నారు. ఎకరం భూమిలో పది రకాల కూరగాయల పంటలను సాగు చేస్తే వరికి వచ్చిన డబ్బులకన్నా రెండింతలు, మూడింతలు సంపాదించవచ్చు. ముఖ్యంగా వేసవిలో అంటే మే, జూన్ నెలల్లో కూరగాయల ధరలు మండిపోతుంటాయి.

దీనిని దృష్టిలో పెట్టుకొని చింతపల్లి ఏజెన్సీ ప్రాంత రైతులు మిశ్రమ కూరగాయలు సాగుచేయాలని చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శివకుమార్ సూచిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం.. కూరగాయల సాగుకు అనుకూలం ఉంటుంది కనుక మిశ్రమ కూరగాయల సాగు చేయాలంటున్నారు. తద్వారా చీడపీడలను అరికట్టడమే కాకుండా.. ప్రతి రోజు ఏదో ఒక పంట దిగుబడిని పొందేందుకు వీలుంటుంది. తద్వారా ప్రతి రోజు ఆదాయం పొందవచ్చంటున్నారు..

కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుండి తగిన ఆదాయం పొందాలంటే ఆయా పంటలను బట్టి ఒక నెల నుండి 4 , 5 నెలల సమయం పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆ పంటకు ఏదైనా నష్టం జరిగి పంట పోతే శ్రమతో పాటు పెట్టుబడి కోల్పోవాల్సిందే.

ఇటువంటి పరిస్థితిని అధిగమించడానికి రైతులు సంవత్సరం పొడగునా ఒక ప్రణాళిక ప్రకారం అన్ని కూరగాయలను సాగు చేసుకొంటే రోజువారీ ఆదాయం వస్తుంది. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా, ఇంకేవిధమైన నష్టం జరిగినా ఒకటి రెండు రకాల పంటలు  నష్టపోయినా మిగతా వాటి నుండి ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు