Sweet Potato Cultivation : ఖరీఫ్ పంటగా చిలగడదుంప సాగు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

Sweet Potato Cultivation : ఆంధ్రప్రదేశ్‌లో పండించే దుంపల్లో చిలగడ దుంప చాలా ముఖ్యమైనది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి ఫోషకాలుగల ఈ దుంపను కూరగాను, పచ్చిగాను, ఉడికించి తింటుంటారు.

Sweet Potato Cultivation

Sweet Potato Cultivation : రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో చిలగడ దుంపను సాగుచేస్తారు. దుంపను కూరగా, ఆకులను పశువులకు మేతగా వినియోగిస్తారు. ఎక్కువగా ఖరీఫ్ లో సాగుచేసే ఈ పంట, నీటి వసతి ఉంటే ఏడాదిపాటు పండించే అవకాశం ఉంది. నాణ్యమైన పంట మార్కెట్ కు చేరితేనే రైతుకు లాభలను అందిస్తుంది.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ఒక్కో సారి ఈ దుంపకు ముక్కుపురుగు సమస్య ఏర్పడుతుంది. ఈ ముక్కుపురుగును అధిగమిస్తూ.. సాగులో మేలైన యాజమాన్యం పాటిస్తే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉందని యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోదనా స్థానం శాస్త్రవేత్తలు.

ఆంధ్రప్రదేశ్‌లో పండించే దుంపల్లో చిలగడ దుంప చాలా ముఖ్యమైనది. తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి ఫోషకాలుగల ఈ దుంపను కూరగాను, పచ్చిగాను, ఉడికించి తింటుంటారు. వీటి ఆకులను పశువుల దాణాగాను, ఆలక్కహాల్ తయారీలోను ఉపయోగిస్తుంటారు. దాదాపు ఏపిలో 791 హెక్టార్లలో 13, 296 టన్నుల ఉత్పత్తిలో పండింస్తున్నారు. దీని శాస్త్రీయ నామం ఇపోమియా బాటాటాస్. చిలగడ దుంపను మొరంగడ్డ, దెనుసు గడ్డ, రత్నపురి గడ్డ అని కూడా పిలుస్తారు.

ఈ దుంప తీపిగా, పిండిగా, పొడిగా ఉంటుంది. మూడు కాలాల్లో పండే ఈ పంటను ఖరీఫ్ లో జూన్ నుండి జులై వరకు , రబీలో అక్టోబర్ నుండి నవంబర్ వరకు , వేసవిలో ఫిబ్రవరి నుండి మార్చి చివరి వరకు వేసుకోవచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ లో వేసుకునే రైతులు అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జోగారావు.

చిలగడ దుంప సాగులో ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. ముఖ్యంగా ఈ పంటకు ముక్కుపురుగు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. ఇది ఆశించిన దుంపలు ఒక రకమైన వాసన వెలువడి, తినడానికి పనికిరావు. కాబట్టి నాటే ముందు లీటరు నీటికి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీ లీటర్లు + కార్బండిజమ్ 3 గ్రాములు కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు