Millet Drink : ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. మార్కెట్‌లోకి మిల్లెట్ డ్రింక్.. ఈ షుగర్ లెస్ డ్రింక్‌ను పిల్లల నుంచి వృద్ధుల వరకు తాగొచ్చు!

Millet Drink : ప్రస్తుతం సూపర్ మార్కెట్ లు, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్ లైన్ సంస్థల్లో ఈ డ్రింక్‌ను అందుబాటులో ఉంచారు. త్వరలోనే అందరి వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

The Healthy Millet drink can consume Children and Old People everyday

Millet Drink : థమ్సప్, కోకాకోలా, స్ప్రైట్ పేర్లు ఏదైనా…  చాలా వరకు కెమికల్స్ కలిసిన డ్రింక్ లే.. వీటి వల్ల.. ఎన్నో అనారోగ్యాలను కొని తెచ్చుంకుంటున్నాం. అయితే ఇప్పుడు సహాజ సిద్ధంగా ఆరోగ్యాన్ని పెంపొందించే మిల్లెట్ డ్రింక్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఆ డ్రింక్ పేరేంటీ.. దీన్ని దేనితో తయారు చేస్తారు.. ఎక్కడ దొరుకుందో తెలియాలంటే ఈ స్టోరీని తప్పకుండా చూడాల్సిందే…

Read Also : Home Agriculture : నగరాల్లో విస్తరిస్తున్న మిద్దెతోటలు – తక్కువ ఖర్చుతో ఇంటిపైనే కూరగాయల సాగు చేస్తున్న కుటుంబం

ఇతడే గండూరి శైలేష్ :
ఎవరి లక్ష్యం విలువైందో.. ఎవరి సంకల్పం బలమైందో.. జీవన పోరాటంలో వారే విజేతలు.. ఈ మాటల సరిగ్గా సరిపోతాయి గండూరి శైలేష్‌కు. ఎంఫార్మసీ పూర్తిచేసిన ఈ యువకుడు దాదాపు 14 ఏళ్ళపాటు హైదరాబాద్ లోని పలు ఫార్మాకంపెనీల్లో ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం తనకు తృప్తినివ్వలేదు. ఏదో సాధించాలనే పట్టుదలే.. నేడు అగ్రిస్టార్టప్ కు నాంది పలికింది.

బాహ్య ప్రపంచంలో ఏ ఆశా కానరానప్పుడు .. మనకు మనమే వెలుగు దివ్వెను రగిలించుకోవాలి. మన కలల ఊటను తవ్వుకోవాలి.. అప్పుడే కల నెరవేరుతుంది. దీన్నే  ముమ్మాటికీ నెరవేర్చాడు యువకుడు శైలేష్ .

మొదట మిల్లెట్స్‌తో సేమ్యా.. ఆపై మిల్లెట్ డ్రింక్ తయారీ :
మొదటి నుండి రిసెర్చ్ పైనే ఆసక్తి ఉన్న ఈయన.. సొంతంగా ఏదో రూపొందించాలనే తపనను తన తోటి మిత్రులతో పంచుకునే వారు. ఇలా అనేక ఆలోచనల తరువాత మార్కెట్ లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాలతో ఉప ఉత్పత్తులను తయారు చేయాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువు.. మొదట మిల్లెట్స్ తో సేమ్యాను తయారు చేశారు.

అయితే అది అంతగా క్లిక్ కాకపోవడంతో… మళ్ళీ పరిశోధన మొదలు పెట్టారు. చివరిగా మిల్లెట్స్  డ్రింక్ తయారు చేశారు. అయితే యూనిట్ నెలకొల్పాలంటే పెట్టుబడి కావాలి. అంత మొత్తంలో లేకపోవడంతో జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ లో ఉన్న ‘ఎ.. ఐడియా’ ను సంప్రదించి… తన ప్రాజెక్ట్ రిపోర్ట్ ను సబ్మిట్ చేశారు. శైలేష్ ఇన్నోవేటీవ్ ఐడియా నచ్చి ఏ ఐడియా 50 లక్షల గ్రాంట్ ను అందించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులోకి :
దాంతో మేడ్చెల్ జిల్లా, ఐడిఏ బొల్లారంలో యూనిట్ ను నెలకొల్పారు. డ్రింక్ కు కావాల్సిన కొర్రలను రైతుల వద్ద కొనుగోలు చేసి బ్లెస్సీ బాడీ పేరుతో మిల్లెట్ డ్రింక్ తయారు చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్ లు, అమేజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్ లైన్ సంస్థల్లో ఈ డ్రింక్ ను అందుబాటులో ఉంచారు. త్వరలోనే వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also : Cow Dung : ఆవు పేడతో బిజినెస్ చేస్తున్న మహిళ.. 10 మందికి ఉపాధినిస్తూ.. అమెరికాకి కూడా..

మన మాట, బాట ఏదైనా సరే.. ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని అడుగు మందుకు పడాలి. అలా పడితేనే ఆయా రంగంలో విజయం త్వరగా చేరుతుంది. అంతేకాదు కష్టపడేతత్వం, వినూత్న ఆలోచనలు తోడైతే.. ఇక వెనుదిరిగే ప్రసక్తే ఉండదని నిరూపిస్తున్నారు శేలేష్.