Kharif Cultivation : ఖరీఫ్ సాగు ఆరంభం.. తొలకరి పలకరింపుతో రైతుల్లో హుషారు

Kharif Cultivation : కొంత మంది రైతులు దుక్కులను సిద్ధం చేస్తుండగా, ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు కొందరు విత్తనాలను విత్తుతున్నారు.

Kharif Cultivation : తొలకరి వర్షాలు పలకరించి.. పుడమి పులకరించడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ప్రభుత్వం సైతం విత్తనాలు అందుబాటులో ఉంచడంతో రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. ఇప్పటికే వేసవి దుక్కులు పూర్తిచేసి పత్తి, సోయా, కంది విత్తేందుకు  సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది తో పోల్చుకుంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగనుందని అంచనా.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు  పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. కొంత మంది రైతులు దుక్కులను సిద్ధం చేస్తుండగా, ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు కొందరు విత్తనాలను విత్తుతున్నారు.

ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం 5 లక్షల 87 వేల ఎకరాలు కగా, 4 లక్షల 20 వేల ఎకరాల్లో ఒక పత్తినే సాగు కానుండి. మిగితా విస్తీర్ణంలో సోయా, కంది లాంటి ఇతర పంటలు సాగు కానున్నాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించింది. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తిని సాగుచేస్తుంటారు రైతులు.  ఇదే అదనుగా మార్కెట్ లో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. అసలే పత్తిసాగుకు పెట్టుబడులు అధికం.. నకిలి విత్తనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.

Read Also : Livestock Care : వర్షాకాలంలో పశువులకు వ్యాధులు అధికం.. సంరక్షణ పద్ధతులు

ట్రెండింగ్ వార్తలు