Cotton Crop : ఈ టిప్స్ పాటిస్తే పత్తిలో పురుగులను అరికట్టవచ్చు

Cotton Crop Tips : పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి, మొక్కల ఎదుగుదల లోపిస్తుంది.

Tips for Prevent Insects in Cotton

Cotton Crop : ఈ ఏడాది వాతావరణ మార్పుల కారణంగా పత్తి చేలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. చాలాచోట్ల పంటకు చీడపీడలు ఆశించి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి, మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి  పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. ఆ తరువాత అధిక వర్షాలు కురవడం.. మళ్లి బెట్టపరిస్థితులు నెలకొనడం… ఇలాంటి పరిస్థితులు పంటల ఎదుగుదలకు, చీడపీడల తాకిడికి  దోహదపడ్డాయి.

ఉమ్మది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం చాలాచోట్ల సోయా, పత్తి పంటలకు పురుగుల తాకిడి ఎక్కువైంది. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో నివారణ చర్యులు చేపట్టినట్లైతే మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉందని రైతుల సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Cattle Farming Tips : పరాన్నజీవుల నుండి పశువులను కాపాడే జాగ్రత్తలు