Tomato Cultivation : శీతాకాలంకు అనువైన టమాట రకాలు.. సాగులో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం

టమోటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యత పెరిగి, మంచి పరిమాణంలో వుంటాయి.భూమిలో తేమను బట్టి వారం పదిరోజులకు ఒక నీటితడినిస్తే సరిపోతుంది.

Tomato Cultivation

Tomato Cultivation : సంవత్సరం పొడవునా సాగుచేయబడుతున్న కూరగాయ పంట టమాటా. అయితే  శీతాకాలంలో సాగుచేసిన పంటలో అధిక దిగుబడితోపాటు, నాణ్యత అధికంగా వుంటుంది. కానీ  నిలకడలేని ధరలు ఈపంటకు ప్రధాన ప్రతిబంధకంగా మారాయి. దీన్ని అధిగమించేందుకు రైతులు టమాటను దఫదఫాలుగా విత్తుకుని సాగుచేస్తున్నారు. శీతాకాలపు పంటనుంచి అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపిక మొదలుకుని సాగు ఆసాంతం ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

READ ALSO : Corn Farming : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరపనేలల నుండి బరువైన బంకనేలల వరకు అన్ని నేలలను సాగుకు ఎంచుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడుభూములు ఈపంటసాగుకు పనికిరావు. శీతాకాలంసాగుకు పూసారూబీ, పూసాఎర్లీడ్వార్ఫ్, అర్కవికాస్ , అర్కసౌరభ్ వంటి రకాలు అనుకూలం. ఇవేకాక రూపాలి, నవీన్, వైశాలి, బి.ఎస్.ఎస్.20 అనే సంకరరకాలను సాగుకు ఎంచుకోవచ్చు. సూటిరకాలైతే ఎకరాకు 200 గ్రాముల విత్తనం, సంకరజాతి విత్తనాలయితే 60 నుండి 80గ్రాముల విత్తనం సరిపోతుంది.

READ ALSO : Ambati Rambabu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సాయం చేస్తే.. టీడీపీని బీజేపీలో విలీనం చేస్తామని లోకేష్ అన్నట్లు సమాచారం : అంబటి రాంబాబు

విత్తేముందు విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇందుకోసం కిలో విత్తనానికి 3గ్రాముల థైరమ్ లేదా 4గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి శుద్ధిచేయాలి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 4మీటర్ల పొడవు, 1మీటరు వెడల్పు, 6అంగుళాల ఎత్తున్న నారుమడులు 8నుంచి10 వరకు అవసరమవుతాయి. ముందు జాగ్రత్తగా నారుకుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి లేదా 0.5శాతం బోర్డోమిశ్రమంతో నారుమళ్ళను తడుపుకోవాలి. నారుమళ్ళలో 10సెంటీమీటర్ల ఎడంతో సన్నని గీతలు తీసుకుని అందులో 1నుంచి1.5సెంటీమీటర్ల లోతులో విత్తనాలను వేసి మట్టితో కప్పుకోవాలి. వెంటనే రోజ్ క్యాన్ తో నీటితడిని అందించి, గడ్డితో నారుమళ్ళను కప్పాలి.

READ ALSO : Laxma Reddy : రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నా ఉసురు తగులుతుంది : రాగిడి లక్ష్మారెడ్డి

3వారాల వయస్సున్న నారుమడిలో రసంపీల్చుపురుగుల నుండి కాపాడటానికి 40చదరపుమీటర్ల నారుమడికి 100గ్రాముల కార్భోఫ్యూరాన్ 3జి. గుళికలు వేసి ఒక నీటి తడిని ఇవ్వాలి. 25నుంచి30 రోజులు వయస్సున్న నారును ప్రధానపొలంలో నాటుకోవాలి. నారును ప్రోట్రేలలో కూడా పెంచి నాటుకోవచ్చు. ప్రధానపొలాన్ని తయారుచేసేటపుడు 3,4సార్లు బాగాదున్ని, ఆఖరిదుక్కిలో 6 నుంచి 8 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి. శీతాకాలంలో సాగుచేస్తున్న టమోట పైరులో వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఎడంవుంచి వరుసల్లో మొక్కల మధ్య 60 సెంటీమీటర్ల దూరంతో నాటుకోవాలి. నాటేటపుడు ఎకరాకు 150కిలోల సూపర్ ఫాస్ఫేట్, 40కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. 48 నుంచి 60 కిలోల నత్రజనిని 3సమభాగాలుగా చేసి, నాటిన 30, 45మరియు 60 రోజుల దశలో పైపాటుగా అందించాలి.

READ ALSO : United Kingdom : ఎంతకాలం ఎదురుచూసినా పెళ్లికొడుకు దొరకలేదట.. చివరికి ఆమె ఏం చేసిందంటే?

ఎరువు వేసిన ప్రతిసారీ తప్పనిసరిగా నీటి తడిని ఇవ్వాలి. కలుపు నివారణకు ఎకరాకు 1 నుంచి 1.2 లీటరు పెండిమిథాలిన్ , 200లీటర్ల నీటికి కలిపి నాటిన 48గంటల లోపు భూమిలో తగినంత తేమ వున్నప్పుడు పిచికారీ చేయాలి.నాటిన 15రోజులకు 300గ్రాముల మెట్రిబుజిన్ మందును 200లీటర్లకు కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. విత్తిన 30-35రోజులకు ఒకసారి గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి.మొక్కలు ఎదిగిన తర్వాత వాటిని కదిలించకూడదు.మొక్కలు పూతదశలో వుండగా 400గ్రాముల 2,4డి మందును 200లీటర్ల నీటిలో కలిపి గానీ లేదా 4లీటర్ల నీటికి 1మిల్లీలీటరు ప్లానోఫిక్స్ కలిపి పిచికారీ చేస్తే పూత,పిందె రాలటం తగ్గి అధిక దిగుబడులకు దోహదపడుతుంది.

READ ALSO : Plastic Water Cans : నిత్యం వాటర్ క్యాన్స్ లోని నీరు తాగుతున్నారా ? క్యాన్సర్, మధుమేహంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యల ముప్పు !

టమోటాలో ఊతం కల్పించే స్టేకింగ్ విధానాన్ని రైతులు ఆచరిస్తే కాయలు నేలకు తగలకుండా నాణ్యత పెరిగి, మంచి పరిమాణంలో వుంటాయి.భూమిలో తేమను బట్టి వారం పదిరోజులకు ఒక నీటితడినిస్తే సరిపోతుంది.రైతులు డ్రిప్ ను ఏర్పాటు చేసుకుంటే నీటిని,ఎరువులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.టమోటాకు కాయతొలుచు పురుగుల బెడద ఎక్కువగా వుంటుంది కనుక ఎరపంటగా బంతి మొక్కలను వేసుకోవాలి.ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసుకోవాలి. ఈవిధంగా సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే నాణ్యమైన, మంచి దిగుబడులు పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు