Turmeric Cultivation : ప‌సుపు సాగు మెళ‌కువ‌లు.. రకాల ఎంపిక, సూచనలు

Turmeric Cultivation Techniques : పచ్చబంగారం “పసుపు” . తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. సాధారణంగా పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి రైతులు సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించాలి. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు పసుపు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక, విత్తే సమయం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా, రాంనగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్ డా. శ్రీధర్ చౌహాన్..

Read Also : Cultivation of Pepper : పామాయిల్ తోటలో మిరియాలు, కోకో సాగు

అంతర్జాతీయంగా పసుపుకు మంచి డిమాండ్ వుండటంతో ఉభయరాష్ట్రాలలోని రైతులు దీని సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోను… ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాలలో దీనిసాగు అధికంగా వుంటుంది. పసుపులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో వున్నాయి.స్వల్పకాలిక రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది.

దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసపు విత్తటానికి నిర్ధేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాధముంది. ప్రస్థుతం  మధ్యకాలిక రకాలు విత్తుకోవటానికి అనువైన సమయం. ఖరీఫ్ కాలానికి పసుపు రైతు సమాయత్తమవుతున్న వేళ రకాల ఎంపిక, అంతర పంటల సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా, రాంనగర్ పసుపు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్ డా. శ్రీధర్ చౌహాన్ .

పసుపు నాణ్యత మనం పాటించే ఎరువుల యాజమాన్యం పై కూడా ఆధారపడి వుంటుంది. కేవలం రసాయనఎరువులపై ఆధారపడకుండా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా సేంద్రీయఎరువులను పంటకు అందించినట్లయితే సాగుఖర్చులు తగ్గటమే కాదు నాణ్యమైన దుంపలను పొందవచ్చు. విత్తనం నాటే టప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి.

Read Also : Varieties of Sugarcane : చౌడుభూములకు అనువైన చెరుకు రకాలు

ట్రెండింగ్ వార్తలు