Turmeric Crop : అధిక వర్షాలతో పసుపుకు తెగుళ్ల బెడద

పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.

Turmeric Crop

Turmeric Crop : సుగంధ ద్రవ్య పంటగా, విశేష వాణిజ్య విలువ కలిగిన పసుపు సాగుకు పెట్టింది పేరు మన దేశం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగులో వున్న ఈ పంటలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్ రెండవ వారం నుండి జూలై చివరి వరకు పసుపును విత్తారు.

READ ALSO : 7 Countries : పేరు మార్చుకున్న 7 దేశాలు ఇవే.. అసలు దేశం పేరు ఎందుకు మారింది? కారణాలు ఏంటి?

ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వల్ల మొక్కలు అధిక ఒత్తిడికిలోనై చాలా ప్రాంతాల్లో పంట పెరుగుదల ఆశించిన విధంగా లేదు. ఈ దశలో పసుపు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. సుధా జాకబ్.

READ ALSO : Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు. ప్రస్థుతం అధిక వర్షాల వల్ల చాలా తోటల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా వుండాలంటూ… పసుపు సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. పి. సుధా జాకబ్.

READ ALSO : Cow Attack : ఓ మై గాడ్.. పగబట్టిన పాములా యువకుడి వెంట పడి మరీ దాడి చేసిన ఆవు.. కొమ్ములతో ఎలా కుమ్మేసిందో చూడండి

పసుపులో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి సాధించాలంటే నిర్ధేశించిన ఎరువులను సమయానుకూలంగా అందించాలి. పసుపు నాణ్యత పెంచేందుకు రసాయన ఎరువులతోపాటు సేంద్రీయ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. రసాయన ఎరువులు పైపాటుగా వేసేటప్పుడు ఆకులపై పడకుండా జాగ్రత్త వహించాలి. నిర్థేశించిన ఎరువులను ఆఖరిదుక్కిలో ఒకసారి, నాటిన 40, 80, 120 రోజులకు క్రమం తప్పకుండా వేయాలి.