Cultivation : అనుకూలించని రుతుపవనాలు…ఏపిలో మందకొడిగానే ఖరీఫ్ సేద్యం

ఈ ఏడాది అల్పపీడనం ఏర్పడితే తప్ప నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు ఆశించినంత మేర పడక పోవటంతో రైతులు సాగుకు అంతగా ఆసక్తి చూపలేకపోయారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఏర్పాడున నాలుగు

Cultivation : ఏపిలో ఖరీఫ్ సాగు అంతంతమాత్రంగానే ఉంది. వ్యవసాయ శాఖ లక్ష్యాల మేరకు ఈ ఏడాది ఖరీఫ్ లో 95.35లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు 63.80లక్షల ఎకరాల్లోనే రైతాంగం పంటలు వేశారు. దీనికి ప్రధాన కారణం నైరుతి రుతుపవనాలు అనుకూలించకపోవటమే. గత మూడు మాసాల కాలంలో సగానికిపైగా రోజులు వర్షాభావ పరిస్ధితులే నెలకొన్నాయి.

రాష్ట్రంలో ప్రధాన నదులైన కృష్ణ, గోదావరిలకు వరదలు వచ్చినా జలాశయాల్లోకి పుష్కలంగా నీరు వచ్చి చేరాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సైతం వరిసాగు మందకొడిగానే సాగుతుంది. నారుమళ్ళ పోసేందుకు అవసరమైన నీరు సకాలంలో అందకపోవటం, వర్షలు కురవకపోతే కాల్వలకు నీరు ఇస్తారో లేదోనన్న గ్యారంటీ లేకపోవటంతో చాలా మంది రైతులు వరి సాగుకు నారుమళ్ళు పోసేందుకు ఆలస్యం చేశారు. మరికొందరు రైతులు వెదపద్దతిలో వరిసాగు చేపట్టారు.

ఈ ఏడాది అల్పపీడనం ఏర్పడితే తప్ప నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు ఆశించినంత మేర పడక పోవటంతో రైతులు సాగుకు అంతగా ఆసక్తి చూపలేకపోయారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఏర్పాడున నాలుగు అల్పపీడనాల్లో రెండు అల్పపీడనాల వల్లే కొంచెం వర్షాలు పడ్డాయి. క్రిష్ణా , గుంటూరు, విశాఖ , గోదావరి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కవగా వర్షపాతం నమోదవ్వగా, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే తక్కవగానే వర్షాలు పడ్డాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైన పంటల వివరాలు పరిశీలిస్తే వరి25.67లక్షల ఎకరాలు, పత్తి 11.15లక్షల ఎకరాలు, వేరుశనగ 14.67లక్షల ఎకరాలు, అపరాలు 5.07లక్షల ఎకరాలు, చిరుధాన్యాలు 3.32లక్షల ఎకరాలు, మిర్చి 1.22లక్షల ఎకరాలు, నూనెగింజలు 0.95వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. మొత్తం కలిపి 63.80లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేపట్టారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్ పంటసాగు 70శాతానికి మించలేదు. పెరుగుతున్న పెట్టుబడులు, కరోనా పరిస్ధుల ప్రభావంతో చాలా మంది రైతులు ఈ ఏడాది సాగుకు పెద్దగా మొగ్గు చూపలేకపోయారు.

ట్రెండింగ్ వార్తలు