jagitya rice suitable for kharif
Varieties Of Jagitya Rice : వరి పరిశోధనల్లో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విశిష్ఠ సేవలు అందిస్తోంది. గత దశాబ్దకాలంలో ఎన్నో రకాలు ఇక్కడి నుండి విడుదలై రైతుల ఆదరణ పొందాయి. ఉత్తర తెలంగాణ మండలానికి అనుగుణంగా ఈ రకాలు రూపొందినప్పటికీ కొన్ని రకాలు దేశవ్యాప్తంగా సాగులో వున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సమయం దగ్గరపడుతోంది. రైతులు రకాలను ఎంచుకొని, విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం…
READ ALSO : Rice Varieties : ఖరీఫ్ కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు
మన ప్రధాన ఆహారపంట వరి. దాదాపు అన్ని జిల్లాల్లోను కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగవుతోంది . ప్రస్థుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి, అధిక దిగుబడినిచ్చే నూతన రకాలవైపు దృష్టి సారించాలి.
READ ALSO : Paddy Cultivation : వరిసాగులో కాలానుగుణంగా మార్పులు.. నూతన వరి వంగడాలను రూపొందిస్తున్న శాస్త్రవేత్తలు
సరైన రకాన్ని, సరైన సమయంలో సాగుచేస్తే ప్రతి కూల పరిస్థితులను అధిగమించి 50 శాతం దిగుబడి సాధించినట్లే . మిగతా 50 శాతం సాగులో మనం పాటించే యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా వున్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగుచేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరిసాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూన్నారు.. జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు డా. జి. శ్రీనివాస్
READ ALSO : High Yielding Rice Varieties : ఖరీఫ్ కు అనువైన వరి రకాలు.. ఎకరాకు 50 బస్తాల దిగుబడి
వరిలో అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విశిష్ఠతను చాటుతోంది. ముఖ్యంగా అనేక సన్నగింజ వరి వంగడాలు ఇక్కడి నుంచి విడుదలయ్యాయి. రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలు నమోదు చేస్తున్నాయి. అయితే ఈ ఖరీఫ్ కు అనువైన రకాలేంటీ.. ఏసమయంలో నార్లు పోసుకోవాలి.. దీర్ఘకాలి, మధ్యకాలిక వరి రకాలు.. వాటి గుణగణాలేంటో సమగ్రంగా తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బి. శ్రీనివాస్