Varieties Of Sorghum Seeds For Rabi Season
Sorghum Seeds : తెలుగురాష్ట్రాల్లో మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా , రబీలో అరుతడి పంటగా జొన్నను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రబీలో పండించే చిరుధాన్యాలలో జొన్న ముఖ్యమైనది. ప్రస్తుతం రబీ మొక్కజొన్నను విత్తేందుకు చాలా మంది రైతులు సిద్దమవుతున్నారు. అయితే అధిక దిగుబడులను సాధించాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సాగు విధానంలో పాటించవలసిన సూచనల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శ్రాస్త్రవేత్త శ్రీరాం.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాధారణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్ధాయిలో పండించడానికి రైతాంగం మొగ్గుచూపుతున్నారు.
అయితే తక్కువ కాలంలో అధిక దిగుబడులను ఇచ్చే జొన్న రకాలను సాగుచేస్తే మంచి ఆదాయం వస్తుంది. అయితే జొన్న మొవ్వు ఈగ బారి నుండి కాపాడుకునేందుకు విత్తేముందే కిలో విత్తనానికి 3 గ్రాము థయోమిథాక్సామ్ మందు లేదా 12 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తనశుద్ది చేయాలి. మరి రబీకి అనువైన రకాలు, వాటి గుణగణాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీరాం.
జొన్నపంటకు ఎరువులు, నీటి తడులను సకాలంలో అందిస్తే మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. మరోవైపు మొవ్వుతొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు , కత్తెర పురుగు జొన్నకు ఆశించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే వీటి నివారణ చేపట్టవచ్చు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు