Vegetable Cultivation : ఊరంతా.. కూరగాయల సాగు..

Vegetable Cultivation : పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మనవద్ద పంట పండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు.

Vegetable Cultivation : ఊరంతా.. కూరగాయల సాగు..

Vegetable Cultivation

Vegetable Cultivation : వాణిజ్య పంటలపై మోజుతో పత్తి, వరి లాంటి పంటలను సాగు చేస్తూ రైతులు , ప్రతికూల పరిస్థితుల కారణంగా దిగుబడిరాక నష్టపోవాల్సి వస్తోంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులపాలవుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రకాశం జిల్లా, కొనకనమెట్ల మండలం, వింజవర్తిపాడు గ్రామానికి చెందిన రైతులు కొన్నేళ్ళుగా కూరగాయలు సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మనవద్ద పంట పండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇలా ఆటుపోట్లు ఎదుర్కొని పంటల సాగును మార్చుకున్నారు  ప్రకాశం జిల్లా, కొనకనమెట్ల మండలం, వింజవర్తిపాడు గ్రామానికి చెందిన రైతులు. ఒకరు కాదు .. ఇద్దరు కాదు.. ఊరు ఊరంతా.. కూరగాయల పంటలనే సాగుచేస్తున్నారు. వచ్చిన దిగుబడిని గుంటూరు మార్కెట్ కు తరలిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.

ఇక్కడి రైతులంతా ఎకరం నుండి నాలుగైదు ఎకరాలున్న సన్న చిన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే.. తక్కువ నీరు.. తక్కువ పెట్టుబడి.. రోజు ఆదాయం.. దగ్గరలో మార్కెటింగ్‌ సదుపాయం ఉండటంతో ఒకరి తర్వాత.. ఒకరు, ఓ గ్రామం.. మొత్తం ఇలా కూరగాయలను సాగు చేస్తూ.. కళకళలాడుతున్నాయి.

సంప్రదాయ పంటలను సాగుచేస్తే పంట కాలం పూర్తయితే తప్పా డబ్బులు రావు. అదికూడా 5 నుండి 6 నెలల సమయం పడుతుంది. అయితే ప్రకృతి సహకరించి, మార్కెట్ లో మంచి ధర పలికితేనే లాభాలను పొందవచ్చు. అదే తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయల పంటలను సాగుచేస్తే రైతుకు ప్రతి రోజు ఆదాయం లభిస్తూ ఉంటుంది..  మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో అందరూ వీటి సాగుకే మొగ్గుచేపుతున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు