Water Hyacinth
Water Hyacinth : గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క. చెరువులు , పంట కాలువలు మరియు వేగంగా ప్రవహించని నీటిలో ఎక్కువ కనిపిస్తుంది. ఈ కలుపు మొక్క వలన కాలువల్లో పడవల రాకపోకలకు ఆటంకం కలగడం, చేపల వేట కష్టంగా మారడం. నీటి నష్టం, దోమలు, ఇతర క్రిమి కిటకాలు వృద్ధి చెందడం వలన జబ్బుల వ్యాప్తి, జీవ వైవిధ్యానికి నష్టం కలుగుతోంది.
ఈ కలుపు మొక్క నీటిపైన తేలియాడుతూ నీటిలోని పోషకాలను పీల్చుకుంటుంది . వేరు భాగంలో ఉండే తేలికపాటి కణజాలం వలన మొక్కకు నీటి పైన తేలియాడే గుణం ఉంది. శాఖీయోత్పత్తి ద్వారా వేగంగా వ్యాప్తి చెంది పూర్తిగా చెరువులు, కాలువల నిండా విస్తరిస్తుంది. శాఖీయోత్పత్తి ద్వారా మాత్రమే కాకుండా ఈ మొక్క పుష్పించి విత్తనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా ప్రవర్ధనం చేదుతుంది.
పంట కాలువల్లో,చెరువుల్లో కలుపు మందులు పిచికారీ చేయడానికి అవకాశం లేకపోవడం వంటి కారణాల వలన క్రొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందే గుణాలు వలన కలుపు మొక్క నివారణ కష్టసాధ్యంగా మారింది.
గుర్రపు డెక్కను పచ్చిరొట్టె ఎరువుగా ;
గుర్రపు డెక్కను కలుపు గా భావించి నివారించడం ఒక అంశం అయితే ఈ కలుపును వ్యవసాయ భూమిలో జీవ వనరులుగా వాడుకొని మాల్చింగ్, తయారీ వంటి వివిధ పద్ధతుల ద్వారా పంటల ఉత్పాదకతను పెంపొందించవచ్చు. గుర్రపు డెక్కను ముక్కలుగా కోసి 1-2 అంగుళాలు పొలంలో దున్నీ లేదా నేరుగా నెలపై మాల్చింగ్ గా వాడుకోవచ్చు. పచ్చి రొట్ట ఎరువుగా నేలకు పోషకాలు అందిస్తుంది. నేల నిర్మాణాన్ని అభివృద్ధి పరుస్తుంది.
నేల నుండి తేమ ఆవిరి రూపంలో నష్టపోకుండా కాపాడుతుంది. అధిక వర్షాల వలన కలిగే నేల కోతను అరికడుతుంది. క్రమం తప్పకుండా గుర్రపు డెక్కతో మాల్చింగ్ చేయడం వల్ల నేలలో కర్బన శాతం పెరిగి నీటి నిలువ ఉంచుకొనే సామర్ధ్యం పెరుగుతుంది.