Stem Borer : వరిలో నష్టం కలిగించే కాండం తొలుచు పురుగు నివారణ మార్గాలు !

కాండం భాగాన్ని తీని వేసి నందున మొక్కకు సరిపడ పోషక పదార్థాలు అందక తెల్లకంకి గా మారి తాలు గింజలు ఏర్పడతాయి. పిలక దశ కంటే కంకి దశలో ఈ పురుగు నష్టం అధికంగా ఉంటుంది. కాండం తొలుచు పురుగు పంట యొక్క ప్రారంభ దశలో కనిపిస్తుంది.

Stem Borer : వరి పంటను నష్టపరిచే పురుగులలో కాండం తొలుచు పురుగు నారు మడి నుండి వరి ఈనె దశ వరకు పంటను ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. నారు మడి దశలో మొక్క మువ్వ లోనికి ఈ గొంగళి పురుగు రంద్రాలు చేసుకొని లోపలికి చొచ్చుకుపోతుంది. మువ్వ ను తినడం వలన మువ్వ గోధుమ రంగు లోనికి మారి మెళికలు తిరిగి ఎండి పోతాయి .ఈ మువ్వను చేతి తో పీకితే సులభంగా వస్తాయి . దీనిప్రభావము వలన మొక్కలు అధికంగా చనిపోతాయి.

కాండం భాగాన్ని తీని వేసి నందున మొక్కకు సరిపడ పోషక పదార్థాలు అందక తెల్లకంకి గా మారి తాలు గింజలు ఏర్పడతాయి. పిలక దశ కంటే కంకి దశలో ఈ పురుగు నష్టం అధికంగా ఉంటుంది. కాండం తొలుచు పురుగు పంట యొక్క ప్రారంభ దశలో కనిపిస్తుంది, ఇది మొత్తం పంట నాణ్యత మరియు దిగుబడిని ప్రభావితం చేస్తుంది. కాండం తొలుచు పురుగులు గోధుమ రంగు గుడ్లను చాలా వరకు ఆకు ఉపరితలంపై 15-80 ద్రవ్యరాశిలో వదిలేస్తాయి.

ముఖ్యంగా ఈ పురుగు ఉధృతి యాసంగి వరిలో అధికంగా ఉంటుంది. పిలక దశలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోపూరాన్ 3జి గుళికలను లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి, 8కిలోలు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0,4జి గుళికలు 4 కిలోలు పలుచగా నీటిని కట్టి వేయాలి. ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలను అమర్చి వారానికి బుట్టకు 25 లేదా అంతకు మించి మగ రెక్కలు పురుగులు పడినట్లైతే పురుగు మందులు పిచికారి చేయాలి. మాస్ ట్రాపింగ్ పద్దతి ప్రకారం ఎకారినిక 8 లింగాకర్షక బుట్టలను అమర్చటం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు