Cotton Farming : తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా సాగు చేన్తున్న వాణిజ్య వంటల్లో ప్రత్తి ప్రధానమైనది. ప్రత్తి సాగు చేసే రైతాంగం ఎక్కువగా తమ పంటపొలాల్లో కలుపు లేకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ గట్ల మీద, వారి పొలం చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పొలానికి దగ్గరగా ఉన్న రోడ్ల వద్ద ప్రమాదకరమైన తుత్తురబెండ, వయ్యారిభామ వంటి కలుపు ప్రత్తి దిగుబడుల మీద మరియు నాణ్యత పైన గణనీయమైన వ్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు చాలా మొండి జాతివి అంతే కాకుండా కాలంతో నిమిత్తం లేకుండా మొలిచి పూతకు వస్తాయి. తుత్తుర బెండ మరియు వయ్యారిభామ కలుపు మొక్కలు నూగు కలిగి ఉంటాయి. ఇవి ప్రత్తి పైరులో పని చేసే వారికి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కలిగిస్తాయి. ఈ మొక్కల్లోని పుప్పొడి అలాగే విషపూరిత రసాయనాలు నీటి ద్వారా, గాలి ద్వారా నేలలోకి చేరి ఇతర పంట మొక్కలను పెరగనివ్వవు, అలాగే నేలలోని సూక్ష్మజీవుల మీద కూడా
ప్రభావం చూపుతాయి.
READ ALSO : Cotton Cultivation : ఎత్తు మడులలో.. పత్తిసాగు ఎంతో మేలు
ప్రత్తి పంటలో ఇటీవల కాలంలో సమస్యాత్మకంగా వున్న రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, తెల్లదోమ, పిండినల్లి,పేనుబంక ఈ మొక్కల ప్రత్యామ్నాయ అవాసాలు. ప్రత్తి వంట లేనప్పుడు ఈ రసం పీల్చుపురుగులన్నీ గట్లు మీద ఉన్న తుత్తుర బెండ, వయ్యారిభామల మొక్కల మీద అవాసాలు ఏర్పరుచుకుని వృద్ధి చెందుతాయి. తామర పురుగులు, తెల్లదోమ పలు వైరస్ తెగుళ్ళకు వాహకాలుగా వున్నాయి.
ప్రత్తిలో టుబాకో న్రీక్ వైరస్ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రత్తి పైరులో మొక్కల తాలి దశలో కలుపు నివారణ చాలా ముఖ్యం. రైతాంగం అంతర కృషి ద్వారావాటిని నివారిస్తున్నారు. కానీ గట్ల మీద ఉన్న కలుపు, పంట కాలం మొత్తం పెరుగుతూనే వుంటాయి. ముఖ్యంగా ఈ కలుపు మొక్కలు అధిక విత్తనోత్పత్తి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏపుగా పెరిగే సామర్థ్యం ఉండటం వల్ల లక్షల్లో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు గాలి, నీరు ద్వారా సుదూరాల వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వీటికి నిద్రావస్థ కూడా దాదాపు 2-8 సంవత్సరాల వరకు ఉంటుంది.
READ ALSO : Cotton : రైతుకు మేలు చేసే… అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు
ప్రత్తి పంట విత్తిన తరువాత దాదాపు 150 రోజుల వరకు పొలంలో ఉంటుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తే పలు వాతావరణ ఒడిదుడుకులకు లోనవుతుంది. బెట్ట పరిస్థితుల్లో తామర పురుగులు మరియు పిండినల్లి ఎక్కువగా ఆశిస్తాయి. ఇవి ఎక్కువగా గట్లమీద ఉన్న తుత్తురబెండ, వయ్యారి భామ మీద నుండి పంట మీదకు వస్తాయి. కావున ఈ కలుపు మొక్కలను నివారించడం ద్వారా, చాలా వరకు తామరపురుగులు , పిండినల్లి వ్యాప్తిని అరికట్టవచ్చు.
ఈ పురుగుల నివారణకు రైతాంగం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలంలో జిగురు అట్టలను ఏర్పరచుకోవాలి. పంట తొలిదశలో వేప సంభందిత మందులను పిచికారీ చేయాలి. అలాగే విత్తిన 30, 45, 60 రోజులకు కాండానికి మందుపూత పద్ధతిని పాటించాలి. రసం పీల్చే పురుగుల ఉనికి, ఉధృతిని అనుసరించి విత్తిన 60 రోజుల తరువాత సిఫారసు చేసిన రసాయనాలను పిచికారీ చేయాలి.
READ ALSO : Cotton Crop : వర్షాలు పడుతున్న సమయంలో పత్తిలో పాటించాల్సిన మెళుకువలు
ఈ మొండి జాతి కలువు మొక్కలైన వయ్యారిభామ, తుత్తురబెండ నివారణకు రైతులు గట్ల మీద ఉన్న ఈ కలుపును పూతకు రాక ముందే పీకి నాశనం చేయాలి. పూతకు వచ్చిన తరువాత వీటిని పీకినట్లయితే వీటి గింజలు నేలపైకి రాలి వృద్ధి చెంది సమస్యాత్మకంగా మారతాయి. రసాయనాల ద్వారా గట్ల మీద ఈ కలుపును నివారించటానికి లీటరు నీటికి 2 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ లేదా 80 శాతం పొడిమందును లేదా లీటరు నీటికి 5 గ్రా. అట్రాజిన్ 50 శాతం పొడి మందులతో ఏదో ఒకదాన్ని నీటిలో కలిపి పూతకు రాకముందే పిచికారీ చేయాలి.
ఈ కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు ప్రత్తి మొక్కల మీద పడకుండా జాగ్రత్తపడాలి. గట్లమీద తాలకరి వర్షాలు పడినవెంటనే కలుపు మొలవకుండానే లేదా అప్పుడే మొలిచిన కలుపును ప్రాధమిక దశలోనే నిర్మూలించడం చాలా అవసరం. ప్రత్తి పంటవేసిన పొలంలోనే కాకుండా చుట్టూ వున్న ప్రదేశాల్లో కూడా ఈ కలుపు మొక్కలను నివారించడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చును.