Honey Bee Farming : తేనెటీగల పెంపకాన్ని ఉపాధిగా మల్చుకున్న మహిళ

Honey Bee Farming : వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అతి తక్కువ ఖర్చుతో, అటు వ్యవసాయానికి, ఇటు రైతుకు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధినిచ్చే రంగంగా తేనెటీగల పెంపకం మారింది.

Woman Earns Huge Profits With Honey Bee Farming

Honey Bee Farming : ఒకప్పుడు అడవుల్లో మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతున్నది.  మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఈ తేనెటీగల పెంపకం కాసుల వర్షం కురిపిస్తున్నది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి.. అనువైన స్థలంలో మొదలుపెడితే క్రమం తప్పకుండా మంచి ఆదాయం వస్తుండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ.. స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అతి తక్కువ ఖర్చుతో, అటు వ్యవసాయానికి, ఇటు రైతుకు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధినిచ్చే రంగంగా తేనెటీగల పెంపకం మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద రాయితీలు, రుణ సౌకర్యం కల్పిస్తుండటంతో చాలామంది గ్రామీణులు, నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.

దీనికితోడు తేనె వినియోగం విస్తృతమవటం,  మార్కెట్ గిరాకీ నానాటికీ పెరుగుతుండటం వల్ల ఆర్ధిక ఫలితాలు ఆశాజనకంగా వున్నాయి. ఈ నేపధ్యంలో తేనె పరిశ్రమను ఉపాధిగా మలుచుకుని ముందుకు సాగుతున్నారు నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, వేగూరు గ్రామానికి చెందిన మౌనిక. ఎమ్మెస్సీ బిఈడి పూర్తి చేసిన ఈమే టీచర్ ఉద్యోగాన్ని చేస్తూనే తేనెటీగల పెంపకం చేపట్టారు.

తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ. పంటల పూత దశ ఎక్కడ వుంటే అక్కడకు పెట్టెలను తరలించాలి. రాణీఈగ గుడ్లు పెట్టే సామర్థ్యం, కూలీ ఈగలు సేకరించే మకరందం పైనే తేనె ఉత్పత్తి ఆధారపడి వుంటుంది. ప్రస్థుతం తేనె మాత్రమే రైతుకు ప్రధాన ఆర్థిక వనరుగా వుంది. కానీ ఈ పరిశ్రమలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు.

Read Also : Crop Varieties : రబీకి అనువైన అపరాల రకాల ఎంపిక.. అధిక దిగుబడుల సాగుకు మేలైన యాజమాన్యం