Zero Tillage Cultivation of Maize
Maize Cultivation : ఇటీవల కాలంలో దుక్కి దున్నకుండానే పంటల సాగు పద్ధతి రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఖరీప్ వరి కోతల అనంతరం పొలంలో వరి కొయ్యకాలల్లో దుక్కి దున్నకుండానే మొక్కజొన్నను సాగుచేస్తున్నారు రైతులు. ఈ పద్ధతిని జీరోటిల్లేజ్ అంటారు. ఈ విధానంలో సాగుఖర్చు తగ్గటమే కాకుండా పంట కాలం కలిసివస్తోంది. అయితే చీడపీడల ఉధృతి పంట దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వీటిని నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. శ్రీలత. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఆహారపంట మొక్కజొన్న. సాధారణంగా ఖరీఫ్ వరి తర్వాత అపరాలపంటలను సాగు చేయటం అనవాయితీగా వుంది. కానీ అపరాల సాగులో సమస్యలు ఎక్కువవటం… దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్ల రైతులు మొక్కజొన్న సాగు వైపు మొగ్గుచూపున్నారు.
అంతే కాకుండా పెట్టుబడి లేకుడా వరిమాగాణుల్లో నేరుగా మొక్కజొన్నను రైతులు సాగుచేస్తున్నారు. దీంతో దుక్కులకు వెచ్చించే డబ్బులు కలిసి రావడమే కాకుండా పంట కాలం కూడా కలిసి వస్తోంది. అయితే ఇటీవల కాలంటో మొక్కజొన్నపంటకు చీడపీడలు ఆశించి తీవ్రనష్టం కలుగజేస్తున్నాయి. వీటి నివారణ చర్యలు ఏవిధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం..
ముఖ్యంగా మొక్కజొన్నకు తెగుళ్ల బెడద అంతగా వుండదు. కొన్ని తెగుళ్లు మాత్రం పంటపై తీవ్రప్రభావం చూపుతాయి. తెగుళ్ల బెడదను గుర్తించినట్లైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించాలి. జీరోటిల్లేజ్ సాగు ద్వారా పొలం దున్నే ఖర్చు, సమయాన్ని తగ్గించవచ్చు. నేల స్వభావాన్నిబట్టి 2 నుండి 4 నీటి తడులను ఆదా చేసుకోవచ్చు.
అంతర కృషి చేయాల్సిన పని లేదు. 10 నుండి 15 రోజల ముందు కోతకొస్తుంది. వరి కోయ్యకాలు భూమిపై పర్చుకొని కలుపును తగ్గించడమే కాకుండా తేమ తొందరగా ఆరిపోకుండా ఉండి మొక్కకు నిరంతరం పోషక పదార్ధాలను అందించడం వల్ల దిగుబడులు పెరుగుతాయి.
Read Also : Kalanamak Rice Variety : బుద్దుడు ఇచ్చిన కాలానమక్ వరి రకాన్ని పండిస్తున్న యువరైతు