Ssc Exam Paper Leak
10th exam paper leaked : చిత్తూరులో పదో తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ లీక్ అయింది. చిత్తూరుకు చెందిన ఓ వాట్సాప్ గ్రూప్ లో తెలుగు కాంపోజిట్ పేపర్ ప్రత్యక్షమైంది. 9 గంటలకు తెలుగు కాంపోజిట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే 9.57 నిమిషాలకు వాట్సాప్ గ్రూప్ లో పదో తరగతి పరీక్ష పత్రాలు ప్రత్యక్షమయ్యాయి. పేపర్ ఎప్పుడు లీక్ అయింది అన్న అంశంపై విద్యాశాఖ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజు పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12గంటల 45నిమిషాలకు ముగుస్తాయి. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
10th exams : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత
కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు జరగలేదు. విద్యాశాఖ విద్యార్థులందరినీ పాస్ చేసింది. 2020లో ఫస్ట్ వేవ్‌లో లాక్‌డౌన్‌తో పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేశారు. ఆ తర్వాత కోవిడ్‌తో విద్యాసంవత్సరం సరిగా సాగలేదు.
ఇక 2021లోనూ సెకండ్ వేవ్ విజృంభించడంతో మళ్లీ పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఏడాది కూడా కరోనా కారణంగా పాఠశాలలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 7 పేపర్లు మాత్రమే రాయనున్నారు.