Student Suicide : ఎగ్జామ్ లో ఫెయిల్‌ అవ్వడంతో రైలు కిందపడి టెన్త్‌ విద్యార్ధి ఆత్మహత్య

టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్ లో ఫెయిల్‌ కావడంతో ఓ విద్యార్ధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం కుటాగులవారిపల్లెలో జరిగింది.

student suicide : ఏపీలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఓ విద్యార్థి ప్రాణాలు తీశాయి. టెన్త్‌ క్లాస్‌ ఎగ్జామ్ లో ఫెయిల్‌ కావడంతో ఓ విద్యార్ధి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలం కుటాగులవారిపల్లెలో జరిగింది. చనిపోయిన విద్యార్థిని ప్రశాంత్‌గా గుర్తించారు. కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

ఏపీలో గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలు విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6.15 లక్షల మంది హాజరుకాగా, 4.14 లక్షల మంది పాస్ అయ్యారు. 2.02 లక్షల మంది బాలురు, 2.11 లక్షల మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 64.02 శాతం బాలురు, 70.70 శాతం బాలికలు పాసయ్యారు. మొత్తంగా 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా 78.30 శాతంతో మొదటి స్థానంలో ఉంది.

Student Suicide : సెల్ ఫోన్ ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

49.70 శాతంతో అనంతపురం చివరి స్థానంలో ఉంది. 797 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత ఉంది. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. పక్క రాష్ట్రాలకంటే ముందుగానే ఫలితాలు ప్రకటించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చే నెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఫెయిలైన వాళ్ల కోసం ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం జూన్ 7 నుంచి ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు