ఏపీ @1583, కొత్తగా 58 కరోనా కేసులు

  • Publish Date - May 3, 2020 / 07:20 AM IST

ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 58 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆదివారం(మే 3,2020) బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1583కి చేరింది. ఇప్పటివరకు 488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది కరోనాతో మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1062.

కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 1, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 30 ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 6వేల 534 శాంపుల్స్ పరీక్షించగా 58మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

466 కరోనా కేసులతో కర్నూలు టాప్:
రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లా 319, కృష్ణా జిల్లాలో 266 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలు ఉండగా, ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే కరోనా ఫ్రీగా ఉంది. కాగా, ఇవాళ్టి లెక్కల్లో కర్నూలు జిల్లాలోనే 30 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత 4 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఎలాంటి మరణం సంభవించ లేదు.