AP Corona Cases : ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 22,204 పాజిటివ్ కేసులు, 85 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

new corona cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 22,204 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో చికిత్స పొందుతూ 85 మంది మృతి చెందారు.

ఏపీలో 11,128 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,03,337కు చేరింది. ఇప్పటివరకు 8,374 మంది కరోనాతో మృతి చెందారు. యాక్టివ్‌ కేసులు 1,70,588కి చేరాయి.

ఏపీలో కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో తొలి రోజు కర్ఫ్యూ మొదలైంది. బుధవారం(మే 5,2021) ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

12 గంటల తర్వాత అన్నీ బంద్ అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటలకు అంటే 18గంటల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇవాళ్టి నుంచి రెండు వారాల పాటు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

కాగా, కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా మిగతావారు బయటకు రాకూడదన్నారు.

కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లింఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. అంతేకాదు బండి కూడా సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాగా, వ్యాక్సిన్ తీసుకునే వారికి మినహాయింపు ఉంటుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు