ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు, ఒకరు మృతి
- bheemraj
- Updated on- January 8, 2021 / 07:56 PM IST
319 new corona cases in AP, one dead : ఏపీలో కొత్తగా 319 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,671 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు.
ఏపీలో గత 24 గంటల్లో 308 మంది కరోనా నుంచి పూర్తిగా కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1,22,24,202 శాంపిల్స్ ను పరీక్షించారు. ఏపీలో ఇప్పటివరకు 8,84,490 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,127 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో 2,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో 8,74,531 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
