3309 New Corona Cases In Ap
new corona cases in AP : ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో వైరస్ బారిన పడి 12 మంది మృతి చెందారు.
చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, గుంటూరు మరియు కృష్ణలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఏపీలో ప్రస్తుతం 18,666 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 7,291 మంది మృతి చెందారు. చిత్తూరులో 740, గుంటూరులో 527, విశాఖలో 391, కర్నూలులో 296, శ్రీకాకుళంలో 279 కొత్త కేసులు నమోదు అయ్యాయి.