పూజల కోసం వెళ్లి శవమైన ఏడేళ్ల బాలుడు.. జొన్నతోటలో అసలేం జరిగింది?

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడిని దుండగులు దారుణంగా హతమార్చి గ్రామ శివారులోని జొన్న తోటలో పడేశారు. మండలంలోని చీగలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ కొడుకు వెంకటాచలపతి నిన్న(ఏప్రిల్ 13,2021) సాయంత్రం నుంచి కనపడటం లేదు. ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ దేవతలకు పూజలు చేసేందుకు మంగళవా

Boy Found Dead : చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. బాలుడిని దుండగులు దారుణంగా హతమార్చి గ్రామ శివారులోని జొన్న తోటలో పడేశారు. మండలంలోని చీగలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ కొడుకు వెంకటాచలపతి నిన్న(ఏప్రిల్ 13,2021) సాయంత్రం నుంచి కనపడటం లేదు. ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ దేవతలకు పూజలు చేసేందుకు మంగళవారం సాయంత్రం కొంతమంది గ్రామస్తులు, యువకులు వెళ్లారు.

వారితో పాటు వెంకటాచలం సైతం వెళ్లాడు. కానీ, రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందారు. వెంకటాచలం కోసం రాత్రంతా వెతికారు. అర్థరాత్రి సమయంలో రోడ్డుపై రక్తపు మరకలు గుర్తించారు. ఆ పక్కనే ఉన్న జొన్నతోటలో గాలించగా బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో అంతా షాక్ అయ్యారు. బాలుడి ముఖం, శరీరంపై బలమైన గాయాలుండటంతో బాలుడిని అతి కిరాతకంగా ఎవరైనా హతమార్చారా..? లేక ఏదైనా వాహనం ఢీకొనడంతో మృతి చెందాడా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.