Call Money Gang Attacked Woman : విజయవాడలో మహిళపై కాల్ మనీ ముఠా వేధింపులు, దాడి..నగదు చెల్లించకుంటే వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి!
విజయవాడలో మరోసారి కాల్ మనీ వేధింపుల కలకలం రేగింది. అదనంగా వడ్డీ చెల్లించలేదంటూ.. ఓ మహిళపై కాల్ మనీ ముఠా దాడికి దిగింది. బాధితురాలు రెండేళ్ల క్రితం రమ్యశ్రీ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే.. అసలు చెల్లించినా అదనంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని రమ్యశ్రీ బెదిరింపులు దిగింది.
- bheemraj
- Published On : September 3, 2022 / 06:57 PM IST
call money gang attacked woman
Call Money Gang Attacked Woman : ఏపీలో కాల్ మనీ ముఠా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. విజయవాడలో మరోసారి కాల్ మనీ వేధింపుల కలకలం రేగింది. అదనంగా వడ్డీ చెల్లించలేదంటూ.. ఓ మహిళపై కాల్ మనీ ముఠా దాడికి దిగింది. బాధితురాలు రెండేళ్ల క్రితం రమ్యశ్రీ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే.. అసలు చెల్లించినా అదనంగా 10 లక్షల రూపాయలు చెల్లించాలని రమ్యశ్రీ బెదిరింపులు దిగింది.
నగదు చెల్లించకుంటే వ్యభిచారం చేయాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారంటూ బాధితురాలు వాపోయారు. వ్యభిచారం చేయనని చెప్పడంతో.. రమ్యశ్రీ, ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. చెప్పినమాట వినకపోవడంతో బాధితురాలిపై కాల్ మనీ ముఠా దాడికి చేసింది.
VRO Suicide : కాల్ మనీ వేధింపులు తాళలేక వీఆర్వో ఆత్మహత్య
బాధితురాలి అరుపులు విని.. చుట్టుపక్కల వారు రావడంతో కాల్ మనీ ముఠా అక్కడి నుంచి పరారైంది. దాడి ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు.. కాల్ మనీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
