Tragedy : తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి

 చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

Boy Dead

boy died falling into floodwaters : చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె చిన్నూరు ప్రాజెక్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం కలిగించింది.

పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం గ్రామానికి చెందిన శ్రీరాములు.. అతని కుమారులు అరుణ్‌, తేజశ్‌తో కలిసి ఏరు దాటుతుండగా ప్రమాదం జరిగింది. తండ్రి, ఇద్దరు కొడుకులు ఏరు దాటుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురూ వరదలో కొట్టుకుపోయారు.

Kondapalli : హైకోర్టు తీర్పు మీదే ఆధారపడ్డ కొండపల్లి చైర్మన్ ఎన్నిక..!

అయితే పోలీసులు తండ్రి శ్రీరాములు, పెద్దకొడుకు అరుణ్‌ను రక్షించారు. కాగా తేజశ్‌ అనే నాలుగేళ్ల చిన్న కొడుకు వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.