acb raids : హవ్వా.. పంచాయతీ కార్యదర్శి సంపాదన అన్నికోట్లా?

అతనో.. గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శి, కానీ ఆయనగారి సంపాదన చూస్తే మాత్రం ఎవరైనా హవ్వా అనాల్సిందే.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు అయ్యగారి అక్రమార్జన ఏకంగా యాభైకోట్ల రూపాయలట .. లెక్కలు

అతనో.. గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శి, కానీ ఆయనగారి సంపాదన చూస్తే మాత్రం ఎవరైనా హవ్వా అనాల్సిందే.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు అయ్యగారి అక్రమార్జన ఏకంగా యాభైకోట్ల రూపాయలట .. లెక్కలు చూసి అధికారులు కూడా అవాక్కయ్యారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆగూరు వెంకటరావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు కనుగొన్నారు. ఆయన ఇంటి తోపాటు సమీప బంధువుల ఇళ్లలోనూ తనీఖీలు చేయగా భారీగా బంగారం, నగదు తోపాటు ఆస్తులకు సంబంచిన డాక్యూమెంట్లు బయటపడ్డాయి.

దాడులలో మొత్తం రూ.35,67,100 నగదు, రూ.17,65,373 విలువైన 669 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు గుర్తించి వాటిని స్వాధీనపరచుకున్నారు. అతని స్థిరచరాస్తులను లెక్కిస్తే మార్కెట్ రేటు ప్రకారం.. యాభైకోట్ల రూపాయల దాకా ఉంటుందని అంచనా వేశారు అధికారులు..

శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకటరావు విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. అయితే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని అవినీతి నిరోధక శాఖ అధికారులు అతనిపై నిఘా ఉంచారు.. ఈ క్రమంలో పక్కా సమాచారం తెలుసుకున్న ACB దాడులు నిర్వహించి అక్రమ సంపాదనను పట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు