జగన్ పార్టీలో చేరిన నటి హేమ

జగన్ పార్టీలో చేరిన నటి హేమ

Updated On : April 1, 2019 / 5:58 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగా ఉన్నాయి. 2019, ఏప్రిల్ 1వ తేదీ సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు నటీనటులు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. సినీ నటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు అయిన హేమను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అధ్యక్షుడు జగన్.
వైసీపీలో చేరిన హేమ.. ఈ ఎన్నికల్లోనే ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. గోదావరి జిల్లాల్లో ప్రచారంలో పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఈస్ట్ గోదావరి మండపేట నుంచి గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీ తరపున పోటీకి కూడా దిగారు. ఆ తర్వాత కాపు ఉద్యమంలోనే పాల్గొన్నారు హేమ. ముద్రగడకు మద్దతుగా హేమ ఈస్ట్ గోదావరిలో జిల్లాలో పర్యటించారు. కొన్ని సామాజిక ఉద్యమాల్లోనూ ఇటీవల చురుగ్గా పాల్గొంటున్నారు. 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన హేమ.. ఈ ఎన్నికల్లో ఈ 10 రోజులు ప్రచారం చేయబోతున్నారు.