కార్ డోర్ లాక్‌పడి ముగ్గురు చిన్నారుల మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం రేపల్లె గ్రామంలో కారు డోర్ లాకై ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలోనే పెట్టిన కారులో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్నారు. కారు అద్దాలు కూడా మూసి ఉండటంతో కూర్చున్న కొద్దిసేపటికే డోర్లు లాక్ అయ్యాయి. లోపల నుంచి చిన్నారులు అరిచిన అరుపులు ఎవరికీ వినిపించలేదు.

క్రమంగా శ్వాస తీసుకోవడం ముగ్గురు చిన్నారులకు ఇబ్బందిగా మారింది. గాలిపీల్చుకోవడం కష్టంగా మారి ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలారు. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు చిన్నారులను వెదకగా కారులో మృతదేహాలను కనిపించారు. అప్పటివరకూ ఇంట్లో సందడి చేసుకుంటూ తిరిగిన పిల్లలు విగతజీవులవడంతో బోరున విలపించారు కుటుంబ సభ్యులంతా. వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.