YSRCP
YSRCP: ఫైనల్‌గా..ఎలాగోలా..ఎప్పటిలాగే వైసీపీ అసెంబ్లీకి అటెండ్ అయింది. 10 మంది సభ్యులతో సహా జగన్ సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి బడ్జెట్ సెషన్ స్టార్టింగ్ రోజు గవర్నర్ ప్రసంగిస్తున్న టైమ్‌లో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో సభలో నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతల ఇష్యూను హైలెట్ చేస్తూ నినాదాలు ఇచ్చారు.
సభలో కొద్దిసేపు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ స్లోగన్స్ చేసిన వైసీపీ సభ్యులు తర్వాత జగన్‌తో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ఇలా వచ్చారు అలా వెళ్లిపోయారంటూ కూటమి అటాక్ స్టార్ట్ చేసింది. వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరవుతామని కండీషన్ పెడుతున్నారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా వైసీపీ తన వైఖరిని మార్చుకోవటం లేదు. కాకపోతే ప్రతీసారి బడ్జెట్ సమావేశాల స్టార్టింగ్ రోజు గవర్నర్ ప్రసంగానికి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. ఈ సారి కూడా అలాగే చేశారు.
Also Read: ‘ఎంతకు తెగించారు’.. ఓటర్లకు దొంగ బంగారం.. నకిలీ వెండి పంపిణీ.. ఎక్కడంటే..
అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తున్నారంటూ కూటమి పదేపదే కార్నర్ చేస్తోంది. నో వర్క్ నో పే విధానం ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించదంటూ ప్రెజర్ పెడుతున్నారు. 90 రోజులు వరుసగా సభకు రాకపోతే అనర్హత వేసే అంశం కూడా పరిశీలనలో ఉందన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది.
అనర్హత నుంచి సేవ్ అయ్యే ప్లాన్
అయితే వన్ డే అటెండెన్స్‌తో వైసీపీ సభ..అనర్హత నుంచి సేవ్ అయ్యే ప్లాన్ చేస్తోందని కూటమి సరికొత్త అస్త్రాలను బయటికి తీస్తోంది. రిజిస్టర్‌లో సంతకాల బదులు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ విధానాన్ని తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత అటెండెన్స్..సిస్టమ్‌ను ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. సభకు వచ్చి వెళ్లిపోతామంటూ కుదరదంటూ తేల్చి చెబుతున్నారు. మరి ఇప్పుడు జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బడ్జెట్ సెషన్‌లో ప్రతీరోజు సభకు హాజరై అటెండెన్స్ వేసుకుని వెళతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వరుసగా ఆరు నెలలు సభకు హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయటానికి అవకాశం ఉందని స్పీకర్..డిప్యూటీ స్పీకర్లు గతంలో పలుమార్లు ప్రస్తావించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్నారని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారనే ప్రజల్లో చర్చ పెడుతున్నారు. ఇలా వైసీపీని కార్నర్ చేయడంలో భాగంగా కూటమి మరో అస్త్రాన్ని బయటికి తీసిందన్న ప్రచారం జరుగుతోంది.
లోపల కూర్చున్న తర్వాతే అటెండెన్స్
అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా సభ్యుల హాజరు నమోదు కానుంది. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి అటెండెన్స్ రికార్డు అవుతుంది. మరోవైపు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలంతా సభకు మస్ట్‌గా హాజరు కావాలని..ఉదయం 9 గంటల వరకు సభలో ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో వైసీపీ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతున్నారే తప్ప..అసెంబ్లీ సమావేశాల్లో చర్చల్లో పాల్గొనడం లేదు. ఇప్పటికే పలుసార్లు అసెంబ్లీకి హాజరు కావాలంటూ స్పీకర్ వైసీపీ సభ్యులకు సూచించగా..సీఎం చంద్రబాబు అయితే సవాల్ కూడా చేశారు. అయితే గవర్నర్ ప్రసంగానికి హాజరవడంపై రెండు రకాల వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గవర్నర్ స్పీచ్‌కు అటెండ్ అయినంత మాత్రాన సమావేశాలకు హాజరైనట్లుగా పరిగణలోకి తీసుకోరని చెబుతున్నారు.
అయితే.. వైసీపీ నేతల వాదన మరోలా ఉంది. గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అసెంబ్లీకి అటెండ్ అయినట్లేనని చెబుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో..సభకు హాజరయ్యారా? లేదా? అన్నది తేల్చేందుకు డిజిటల్ సిస్టమ్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీంతో..సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా.? లేక ఎప్పటిలాగే వన్ డే అటెండెన్స్‌కే పరిమితం అవుతారా అన్నది అతిపెద్ద ప్రశ్నగా మారింది. కూటమి స్కెచ్ ఏంటి..వైసీపీ ఎమ్మెల్యేల వ్యూహమేంటి? అన్నది ఉత్కంఠ రేపుతోంది.