ఆంధ్రప్రదేశ్ ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవపట్టిస్తున్నాడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ లేఖ రాశారు.
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవపట్టిస్తున్నాడని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ లేఖ రాశారు. రానున్న ఎన్నికల్లో ప్రజల దృష్టి మరల్చడానికి ప్రత్యేక హోదా పేరుతో కేంద్రం పై పోరాటం చేస్తున్నారని, తన రాజకీయ భవిష్యత్తు కాపాడుకోడానికి యూటర్న్ తీసుకుని ప్రజలను మభ్య పెడుతున్నాడన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే సంస్కారం లేకుండా నరేంద్ర మోడీ పై వ్యక్తగత దూషణలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి మాటలను ఏపీ ప్రజలు నమ్మకూడదంటూ అమిత్ షా ఆరు పేజీల బహిరంగ లేఖ రాశారు.