Anandaiah Medicine: ఆనందయ్య కంటి మందు హానికరమే..!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందులో కంటిలో వేసే డ్రాప్స్‌కు తప్ప మిగిలినవాటికి ఇప్పటికే ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే, ఐ డ్రాప్స్‌‌లో మాత్రం కంటికి హాని కలిగించే హానికర పదార్థాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది.

Anandaiah Eye Medicine Is Harmful

Anandaiah Medicine: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందులో కంటిలో వేసే డ్రాప్స్‌కు తప్ప మిగిలినవాటికి ఇప్పటికే ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. అయితే, ఐ డ్రాప్స్‌‌లో మాత్రం కంటికి హాని కలిగించే హానికర పదార్థాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. ఆనందయ్య కంటి మందు కళ్లకు హాని కలుగుతుందంటూ నివేదికలు వచ్చాయని హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను పరిశీలించిన హైకోర్టు.. పరీక్షల నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఐ డ్రాప్స్‌ శాంపిళ్లను ఐదు సంస్థలకు పంపించగా.. కంటి చికిత్స రంగంలో ఎంతో పేరున్న ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్, శంకర నేత్రాలయ సంస్థలు ఐ డ్రాప్స్‌లో హానికర పదార్థాలున్నట్లు నివేదికలు ఇచ్చాయని, ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ వాదించారు. ఆనందయ్య తరపు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ మాత్రం.. ఐ డ్రాప్స్‌ వల్ల దుష్ప్రభావాలు ఉండవని తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందని అన్నారు. కంటిమందుపై తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది హైకోర్టు.

ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్‌ తయారు చేయగా.. మందుల వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆనందయ్యతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఐ డ్రాప్స్‌ మినహా మిగిలిన నాలుగు రకాల మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంటి మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు.