Andhra Pradesh Bandh: ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ కు పిలుపు ఇస్తున్నామని తెలిపారు.
- T Venkateshwarlu
- Published On : September 10, 2023 / 08:28 PM IST
Andhra Pradesh Bandh
Andhra Pradesh Bandh – TDP: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ కు పిలుపు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంతటా 144 సెక్షన్ విధించారు.
చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రత ఉందని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయన హౌస్ అరెస్టులో ఉండే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. అది కుదరకపోతే ఆయనను ప్రత్యేక జైలుకి తరలించాలని పిటిషన్ వేశారు.
చంద్రబాబుకు ఇంటి భోజనంతో పాటు మందులు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
