Chandrababu : చంద్రబాబుకి రిమాండ్.. వైసీపీ నేతల సంబరాలు.. స్వీట్లు తినిపించుకుని టపాసులు పేల్చి ఆనందోత్సాహాలు

చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. Chandrababu Remand

Chandrababu : చంద్రబాబుకి రిమాండ్.. వైసీపీ నేతల సంబరాలు.. స్వీట్లు తినిపించుకుని టపాసులు పేల్చి ఆనందోత్సాహాలు

Chandrababu Remand (Photo : Google)

Updated On : September 10, 2023 / 10:51 PM IST

Chandrababu Remand : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి రిమాండ్ విధించింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు ఆదివారం(సెప్టెంబర్ 10) రాత్రి 7గంటల ప్రాంతంలో తీర్పు చదివి వినిపించారు. చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. టపాసులు కాల్చారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.

Also Read..Chandrababu Arrest : ఏసీబీ కోర్టులో 28పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. సంచలన విషయాలు వెల్లడి.. అందులో ఏముందంటే?

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సంబరాల్లో మునిగిపోయారు. ఆమె తన ఇంటి దగ్గర స్వీట్లు పంచారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. టపాకాయలు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ”దేవుడు ఉన్నాడు. చంద్రబాబు చేసిన పాపాలు పండాయి. కల్మషం లేని నేతగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు నిజ స్వరూపం ఇవాళ బట్టబయలైంది. మిగిలిన కుంభకోణాల్లో కూడా ఆయనకు శిక్ష తప్పదు. దివంగత ఎన్టీఆర్ ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరుతుంది” అని మంత్రి రోజా అన్నారు.