AP Cabinet: రేపే ఏపీ క్యాబినెట్ భేటీ.. అమరావతి రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ.. నిరుద్యోగులకు సర్కార్ బంపర్ గిఫ్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ (AP Cabinet)అత్యవసర సమావేశం జరగనుంది.

Andhra pradesh cabinet meeting amaravati farmers relief industrial investment approval

  • రేపు ఏపీ క్యాబినెట్ భేటీ
  • అమరావతి రైతులకు రుణాల మాఫీ
  • తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులు

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధి, రైతు సంక్షేమం, పారిశ్రామిక పురోగతే లక్ష్యంగా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఊరట కలిగిస్తూ కొత్త పూలింగ్ గ్రామాల పరిధిలోని రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ ప్రతిపాదనకు, కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి రూ.40 వేల యాన్యుటీ చెల్లింపునకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే గ్రామ కంఠాల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు నెలకు రూ.10 వేల చొప్పున అద్దె భత్యం మంజూరు చేయనున్నారు.

MT Krishna Babu: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ప్రకటన.. ఆ వార్తలు నమ్మకండి

రాజధానిని (AP Cabinet)అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా పలు ప్రతిష్టాత్మక సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సీఆర్డీఏకి అనుమతి ఇవ్వనున్నారు. వీటితో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, సీఐఐ (CII)కి 4 ఎకరాలు, ఫిషరీస్ శాఖ ఆధునిక అక్వేరియం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఈశా ఫౌండేషన్‌కు భూమితో పాటు పార్కు నిర్వహణ బాధ్యతలను అప్పగించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడనుంది.

మరోవైపు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ఇటీవల ఎస్‌ఐపీబీ (SIPB) ఆమోదించిన 11 కీలక ప్రాజెక్టులకు క్యాబినెట్ తుది ఆమోదం తెలపనుంది. దీని ద్వారా ఏపీలోకి దాదాపు రూ.9,076 కోట్ల భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కొత్తగా 10,531 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాజధాని అభివృద్ధి, పారిశ్రామిక రంగాల బలోపేతానికి ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది.